జగన్ రెడ్డి ప్రభుత్వం… కాంట్రాక్టర్లను ఎంత రాచి రంపాన పెట్టిందో అందరూ చూశారు. ప్రభుత్వం మెల్లగా లెక్కలు తీస్తూంటే… మొత్తం పెండింగ్ బిల్లులు లక్షల కోట్లకు కాస్త తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాను అనుకున్న వారికే చెల్లింపులు చేస్తున్నారు. అలా 2019 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకూ లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. ఇందులో కొన్ని కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులతోపాటు, ఉద్యోగులకు సంబంధించినవి కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి.
Read Also : జగన్ కోసం వచ్చిన వారంతా బిల్లుల బాధితులే !
93 వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులను ఇప్పటివరకు ఆర్థిక శాఖ సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ కూడా చేయలేదు. మరో 48 వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు అప్లోడ్ జరిగినప్పటికీ, చెల్లింపులు జరగలేదు. పెండింగ్లో ఉన్న బిల్లుల్లో ఎక్కువ భాగం నీటి పారుదల శాఖకు చెందినవే ఉన్నట్లు సమాచారం. పోలవరంతోపాటు ఆనేక పథకాలకు 19,324 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు పనులు ఆపివేసి వెనక్కు వెళ్లిపోయారు . ఆ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రూ.14 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి.
బకాయిలు లేని శాఖ అంటూ లేదు. అలాగే ఆయా శాఖల ఖాతాల్లో డబ్బులు కూడా లేవు. కొన్ని వేల మంది ప్రభుత్వంపై ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఆర్థిక శాఖ అధికారులపై ఎన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు శిక్షలు కూడా వేసింది. ఈ బిల్లులన్నింటినీ ఇప్పటి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది.