గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలను ఈ ప్రభుత్వం వెసులుబాటు దొరికనప్పుడల్లా చెల్లిస్తోంది. గత ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసినా బడా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి వేసేసేది. చిన్న బిల్లులు అన్నీ పెండింగ్ లోఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం తమకు ఆర్థిక వెసులుబాటు దక్కగానే రూ. 6700 కోట్లను చిన్న బిల్లులు చెల్లించాడనికి ఉపయోగించింది. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ నిధులు కూడా రిలీజ్ చేశారు.
బిల్లుల కోసం ఎదురు చూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రిలీజ్ చేశారు. వైసీపీ హయాంలో పనుల ుచేసి.. బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వివక్ష లేకుండా నిజాయితీగా పనులు చేసిన వారికి బిల్లులు మంజూరు చేశారు. మరో వైపు ఉద్యోగుల జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను రూ. 519 కోట్లను మంజూరు చేశారు. పోలీసులకు సరెండర్ లీవుల డబ్బులను వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వారందరికీ ఇప్పుడు రిలీజ్ చేశారు.
చిన్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు బకాయిలు పెట్టి.. జగన్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు పనులు చేయకపోయినా బిల్లులు చెల్లించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రాధాన్యతలు మార్చుకుంది. బిల్లులు అందక ఇబ్బంది పడుతున్న వారి కష్టాలను తీర్చింది. మార్చిలో మరింత ఎక్కువగా బిల్లులు క్లియర్ చేసే అవకాశం ఉంది.