థ్రిల్లర్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఏ భాషలో ఆడిన కథ అయినా, తెలుగులో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈమధ్య కాలంలో రాక్షసుడు లాంటి సినిమాలు బాగా ఆడాయి. ఇప్పుడు మరో థ్రిల్లర్ వస్తోంది. అదే ‘పెంగ్విన్’.
కీర్తీ సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. పిజ్జాలాంటి సినిమాల్ని ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇది ఓ అమ్మకథ. తన కొడుకు అడవిలో తప్పిపోతాడు. అదే అడవిలో ఓ భయంకరమైన సైకో తిరుగుతుంటాడు. అక్కడి నుంచి తనయుడి కోసం తల్లి అన్వేషణ మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, వాటిని ఢీ కొట్టిన మగువ ధైర్యం… ఇదే పెంగ్విన్ కథ. అమేజాన్ ప్రైమ్‌లో ఈనెల 19న ఈ సినిమానిచూడొచ్చు. నేరుగా ఓటీటీలోకి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో ఇదొకటి. ట్రైలర్ చూస్తుంటే.. మంచి థ్రిల్లర్‌ని చూడబోతున్నామన్న ఆశలు చిగురిస్తున్నాయి. కాకపోతే… హింస, రక్తపాతం, సైకోయిజం ఈ కథలో కాస్త మెండుగా కనిపిస్తున్నాయి. `రాక్షసుడు` పోలికలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో?