జగన్ రెడ్డి రాజకీయం అంతే ఇలాగే ఉంటుంది. గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా మరో నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అసలు గుడివాడలో ఇటు పుల్ల తీసి అటు పెట్టాలంటే కొడాలి నాని పర్మిషన్ ఉండాలి. అలాంటిది ఆయన లేకుండా కొత్త పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందా ? . ఊహించడమే కష్టం. కానీ జరిగింది. అలాంటిది జరిగితే …కొడాలి వర్గీయులు ఊరుకుంటారా… ఊరుకోరు అందుకే.. గొడవ పడ్డారు. దీంతో గుడివాడలో కొడాలి నానికి తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలా… . ఏం జరుగుతోందని అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
శనివారం కొత్త మున్సిపల్ కార్యాలయంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్య క్రమం జరిగింది. ఎంపీ బాలశౌరి ముఖ్య అతిథి. కానీ కొడాలి నానికి సమాచారం లేదు. ఎమ్మెల్యే నాని లేకుండా కార్యక్రమం నిర్వహించడం ఏంటని … నాని వర్గీయులు ఈ కార్యక్రమంపై ఒక్క సారిగా దాడి చేశారు. బాలశౌరి అనుచరులు…. కొడాలి నాని అనుచరులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఒక కారు ధ్వంసం అయింది. అయితే పరువు పోతుందని పోలీసుల కేసుల వరకూ వెళ్లలేదు. కానీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వల్లభనేని బాలశౌరిని జగన్ ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం వైసీపీ వర్గీయుల్లో ఉంది. కొడాలి నాని విషయంలో జగన్ రెడ్డి మరో ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. ఆయనను ఈ సారి లోక్ సభకు పోటీ చేయించేలా ఒప్పించేదుకు ప్రయత్నిస్తున్నారని అందుకే…. బాలశౌరిని గుడివాడకు పంపుతున్నారని భావిస్తున్నారు. మొత్తంగా వ్యవహారంలో గుడివాడలో… తన ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఉండటం తప్ప…. కొడాలి నాని ఏమీ చేయలేని పరిస్థితి.