పెన్షన్ విషయాన్ని ఏపీలో ఎందుకు ఇంత గందరగోళం చేశారు. వృద్ధులకు పెన్షన్ అందదు.. కావాలంటే వచ్చి తీసుకోవాల్సిందే అని ఎందుకు హడావుడి చేశారు ?. అందరూ వచ్చేదాకా ఫోన్లు చేసి.. ఆ తర్వాత కొంతే వచ్చిందని ఎందుకు పుకార్లు రేపారు ?. రెండు రోజులుగా ఈ మొత్తం స్క్రీన్ ప్లే డాట్స్ ను కలిపితే .. వృద్ధులను చంపేసి రాజకీయం చేయాలన్న ఓ భయంకరమైన కుట్ర మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
సీన్ 1: పెన్షన్లు రావని ప్రచారం
ఏపీలో అరవై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకూ ఉంటారు. వీరందరికీ ఒక రోజు ముందుగానే మీకు పెన్షన్లు రావు అనే భయాన్ని కల్పించారు. చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పడానికి ఈ ప్రచారం చేశారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. కదల్లేని వాళ్లకు ఇంటి దగ్గరే ఇస్తామన్నారు. మిగిలిన వాళ్లు సచివాలయానికి వచ్చి తెచ్చుకోవాలన్నారు. మొదటి పాయింట్ ను తొక్కి పెట్టేశారు. అందరూ సచివాలయాలనికి రావాలని వాలంటీర్లు ఒత్తిడి చేశారు.
సీన్ 2 : ఉదయమే వృద్ధులంతా సచివాలయాలకు !
వాలంటీర్లు , వైసీపీ నేతలు చేసిన ప్రచారం మేరకు.. వృద్ధులంతా సచివాలయాలకు చేరుకున్నారు. ఒక్కో సచివాలయం వద్ద ఐదు వందల నుంచి వెయ్యి మంది గుమికూడారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకుల నుంచి డబ్బులు తెస్తామని ఉద్యోగులు వెళ్లారు.
సీన్ 3 : వృద్ధులకు వడదెబ్బ తగిలేలా ప్లాన్
మధ్యాహ్నం వరకూ తిరిగి రాలేదు. వృద్ధులకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. మంచి నీళ్లు లేవు. నీడలో కూర్చునే పరిస్థితిలేదు. ఏపీలో ఎండలు 40 డిగ్రీల ప్లస్ నమోదవుతోంది., కొన్ని చోట్ల ఇంకా ఎక్కువే. డబ్బుల కోసం వెళ్లిన వాళ్లు మధ్యాహ్నం మూడు తర్వాతే తిరిగి వచ్చారు. అప్పటి వరకూ లబ్దిదారులు ఎండలో మలమల్లాడిపోయారు.
సీన్ 4 : డబ్బులు కొద్దిగా వచ్చాయని తొక్కిసలాటకు కుట్ర
ఉదయం నుంచి వృద్ధుల్ని ఎండలో బెట్టి.. వడదబెబ్బ తగిలేలా చేసిన ప్రభుత్వం సచివాలయాలకు మొత్తం డబ్బు పంపలేదు. సగం కూడా పంపలేదు. ఈ విషయం తెలియగానే వృద్ధులు వచ్చిన మొత్తంలో తమకంటే తమకు ఇవ్వాలని తొక్కిసలాటకు దిగేలా కుట్ర చేశారని సులువుగా అర్థమైపోతుంది.
సీన్ 5 : కొన్ని ప్రాణాలు బలి – రాజకీయం కోసం విశ్వప్రయత్నం
ఖచ్చితంగా వృద్ధులు కొంత మంది చనిపోయారని.. వారి శవాలతో రాజకీయం చేయాలని ఖచ్చితమైన ఇన్ స్ట్రక్షన్స్ వారికి ఉన్నాయి. అందుకే శవం కనిపించగానే.. జోగి రమేష్ వెళ్లిపోయారు. అక్కడ ఆయన ప్లాన్ బెడిసికొట్టింది.. అది వేరే విషయం.
కానీ ఈ స్క్రీన్ ప్లే చూస్తే.. మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని ఒళ్లు గగుర్పొడుస్తుంది. వృద్ధుల్ని హత్య చేయడానికి ఎంత పక్కాగా చేతికి మట్టి అంటకుండా ప్రణాళిక వేశారో అర్థమైతే.. మనం క్రూరమృగాల మధ్య బతుకుతున్నామన్న భయం వేస్తుంది. ఇదా మనుషులు చేసే పని.. ఇదా మానవత్వం ?