2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతల్ని ఎంతగా టార్గెట్ చేశారంటే.. పల్నాడు టైగర్‌గా పేరు పొందిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఆయనపై ఎంత మందితో ఫిర్యాదులు చేయించారో లెక్కలేదు. కనీస ఆధారాలు లేకపోయినా కేసులు నమోదు చేశారు. ఆయన కుమారుడు,కుమార్తె పేరుతో ఎంత వేధించాలో అంతా వేధించారు. చివరికి ఫర్నీచర్ పేరుతో వేసిన నిందలు భరించలేక ఆయన బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. జీవితాంతం టైగర్‌గా బతికిన కోడెల చివరికి అలా వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం పెను విషాదంగా మారింది.
టీడీపీ నేతలు ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు బాధ్యులకు ఖచ్చితంగా మిసెరబుల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని అనుకుంటున్నారు. అప్పట్లో కోడెలను వేధించే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నారు. రాజకీయంగా విజయసాయిరెడ్డి.. ఆయన చెప్పినట్లుగా యంత్రాంగాన్ని ఉపయోగించి పీఎస్ఆర్ ఆంజనేయులు… కోడెలను వేధించారు. ఆయనపై తప్పుడు ప్రచారాలు చేశారు. మానసికంగా వేధించారు.
ఇప్పుడు కోడెల ఆత్మహత్యకు విజయసాయిరెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వాల్సిందేనని టీడీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. నిజానికి వీరిద్దరూ ఈ ఒక్క అంశంలోనే అతి చేయలేదు. పీఎస్ఆర్ ఆంజనేయలు..ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ట్యాపింగ్‌లు చేశారు. టీడీపీ నేతల్ని వేధించారు. జేసీ వ్యాపారాలన్నీ మూలకు పడటానికి ఈయనే కారణం. అన్నింటికీ సరైన శిక్షలు ఖాయమన్న అభిప్రాయాలుఎక్కువగా వినిపిస్తున్నాయి.