ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదికను సుప్రీంకోర్టు ధర్మాసనానికి సమర్పించారు. గతంలోనే సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరిపి ఏడాదిలోగా ప్రజాప్రతినిధులపై కేసుల ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే మొదట్లో అలా విచరాణ చేసినా.. తర్వాత మళ్లీ వాయిదాల పర్వం ప్రారంభమయిది. దీంతో విజయ్ హన్సారియా సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక సూచనలు చేశారు.
దిగువ కోర్టులు.. విచారణ జరుపుతున్న కోర్టులో రోజువారీ విచారణ చేయాలని ..రెండు సార్లు నిందితులు కోర్టుకు హాజరు కాకపోతే.. అరెస్టు వారెంట్ జారీ చేయాలని.. మూడేళ్లకుపైగా ట్రయల్ ఆగిపోతే .. కోర్టులో ఆ కేసును పరిష్కరించిన తర్వాతే మరో కేసును చేపట్టేలా చూడాలని హన్సారియా సుప్రీంకోర్టును కోరారు. చాలా మంది నిందితులు కోర్టులకే రావడం లేదన్నారు. సాధారణగా అమికస్ క్యూరీ సిఫారసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలుపుతుంది. విచారణకు వచ్చినప్పుడు తదుపరి ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వనుంది.
సుప్రీంకోర్టు అవినీతి నేతల సంగతి తేల్చాలని అనుకుంటే మాత్రం వైఎస్ జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. జగన్ హయాంలో చంద్రబాబుపై పెట్టిన కేసులు సహా అన్నీ విచారణకు రానున్నాయి. విచారణ శరవేగంగా జరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయవ్యవస్థ పవర్ ఫుల్. ఆ వ్యవస్థ ఎప్పటికప్పుడు తమ నేతల్ని కాపాడుకునేందుకు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. అందుకే కేసుల విచారణ ఆలస్యం అవుతోంది. కానీ ఈ సారి మాత్రం.. కేసుల లెక్క తేల్చి.. అవినీతి నేతల్ని జైలుకు పంపే వరకూ .. కోర్టులు శరవేగంగా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.
జగన్ లాంటివారు.. న్యాయవ్యవస్థలో ఇన్నలోపాలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో పిటిషన్ల మీద పిటిషన్లు వేసి అసలు ట్రయలే ప్రారంభం కాకుండా చేస్తున్నారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ సిఫారసులు అమల్లోకి వస్తే.. ఈ సారి న్యాయవ్యవస్థ నుంచి కఠినమైన యాక్షన్ ను ఆశించవచ్చని అంచనా వేస్తున్నారు.