తెలుగు చిత్రసీమలో మైత్రీ మూవీస్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంది. భారీ చిత్రాలకు మైత్రీ పెట్టింది పేరు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు,దర్శకులు, హీరోయిన్లందరికీ మైత్రీ అడ్వాన్సులు ఇచ్చేసింది. మైత్రీ నుంచి అడ్వాన్సు అందుకోని నటీనటులు, టెక్నీషియన్లు ఉండరేమో..? ఓ సినిమా హిట్టయితే సదరు దర్శకుడికీ, హీరోకి ముందుగా అడ్వాన్స్ చెల్లించేది మైత్రీనే. వాళ్లతో మైత్రీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో ఎవ్వరూచెప్పలేరు.
ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ కూడా మైత్రీలానే ఆలోచిస్తోంది. మైత్రీలా దూసుకుపోతోంది. అదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇదివరకటి నుంచీ ఈ సంస్థ సినిమాలు చేస్తున్నా.. ఈమధ్యే టాలీవుడ్ లో కాస్త గట్టిగానే ఈ సంస్థ పేరు వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా కూడా… మైత్రీ లానే చాలామంది హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చుకొంటూ పోతోంది. ఇటీవల దాదాపు పదిమంది హీరోలకు, పదిమంది దర్శకులకు పీపుల్స్ మీడియా అడ్వాన్సులు ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు.. ఓ బాలీవుడ్ హీరోతోనూ పీపుల్స్ మీడియా సంప్రదింపులు జరుపుతోందట. `కార్తికేయ 2`తో హిట్టు కొట్టిన చందూ మొండేటితో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని ఇప్పుడు పీపుల్స్ మీడియా భావిస్తోంది. అందుకే బాలీవుడ్ హీరోని రంగంలోకి దింపుతోంది. ఎలా చూసినా పరిశ్రమలోని సగం హీరోలు, దర్శకులు మైత్రీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతుల్లో ఉన్నట్టే