పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘బ్రో’ వారి సంస్థలో 25వ సినిమాగా విడుదల చేస్తున్నారు. సెట్స్ పై మరో పదిహేను సినిమాలు వున్నాయి. నిన్ననే రవితేజ తో ‘ఈగల్’ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా యాభై సినిమాలు పూర్తి చేయాలనేది వారి టార్గెట్. నాలుగేళ్లలో వంద సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే పీపుల్ మీడియా తలుపుతట్టిన ప్రతి దర్శకుడి కథని ఓకే చేసి అడ్వాన్స్ ఇచ్చి లాక్ ప్రీప్రొడక్షన్ మొదలుపెడుతున్నారు.
నాలుగేళ్లలో వంద సినిమాలు అనేది అరుదైన రికార్డ్ అవుతుంది. వంద సినిమాలు చేసిన నిర్మాణ సంస్థలు చాలా తక్కువ వున్నాయి. పైగా నాలుగేళ్లలో వంద సినిమాలు అంటే ఇప్పటి వరకూ ఎవరూ అందుకొని రికార్డ్ ఇది. ఇప్పుడు దానిపైనే ద్రుష్టి పెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వారికి చాలా మంచి టీమ్ వుంది. మిగతా సంస్థలతో పోల్చుకుంటే కథని ఓకే చేసుకునే ప్రాసస్ చాలా స్పీడ్ గా వుంది. కొన్ని సంస్థల్లో కథ ఓకే కావాలంటే ఏడాది తిరిగినా పని జరగదు. కానీ మారుతున్న పరిస్థితులు సినిమాని, ప్రేక్షకులు సినిమాని చూసే విధానంలో వచ్చిన మార్పులు అందిపుచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. దానికి తగ్గట్టు కథ ఓకే చేసి, సినిమా తయారూ చేసే విధానంలో ఒక ఫ్యాక్టరీ మోడల్ ని అనుసరిస్తుంది. సంస్థ ద్రుష్టి పెట్టినట్లుగా నాలుగేళ్లలో వంద సినిమాలు చేయగలిగితే నిజంగా అది కనీవినీఎరుగని రికార్డ్ అవుతుంది.