ఇటీవల సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వపనితీరు పట్ల ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉందో తెలుసుకొనేందుకు ఒక సర్వే నిర్వహించింది. అందులో 50 శాతంకి పైగా ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. సర్వే వివరాలు:
పట్టణ ప్రజలు- గ్రామీణ ప్రజలు- రాష్ట్రంలో మొత్తంగా
రాష్ట్రాభివృద్ధి బాగుంది 70% – 63% – 67%
మతసామరస్యం నెలకొని ఉంది 63% – 58% – 61%
జిల్లాల సమానాభివృద్ధి జరుగుతోంది 58% – 49% – 54%
అవినీతి తగ్గుముఖం పట్టింది 43% – లేదు
చంద్రబాబు హామీలు అమలవుతున్నాయా? 63% – 54% – 59%
చంద్రబాబుపై నమ్మకం పెరిగిందన్నవాళ్ళు 55% – 51% – 53%
ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలలో ఏది బాగా పని చేస్తోంది? అనే ప్రశ్నకు తెలంగాణా ప్రభుత్వం బాగా పనిచేస్తోందని పట్టణ ప్రజలు అభిప్రాయపడగా రెండూ బాగానే పనిచేస్తున్నాయని గ్రామీణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసారు.