ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలిరావలసిందేనని ముఖ్యమంత్రి ప్రభుత్వోగులను బ్రతిమిలాడటం, సహకరించాలని విజ్ఞప్తులు చేయడం చంద్రబాబు నాయుడు ని తీవ్రంగా వ్యతిరేకించేవారికి కూడా నచ్చడంలేదు. ”తింటున్న డబ్బు, అనుభవిస్తున్న సదుపాయాలు చాలు…బయలుదేరండి…అమరావతిలో నైనా మీరు చేసే పని అదేగా” అని ప్రభుత్వోద్యోగులను ప్రజలు ఈసడించుకుంటున్నారు.
సగటు పౌరుల ఆదాయాలు, సదుపాయాల కంటే ప్రభుత్వోద్యోగుల సగటు ఆదాయాలు, సదుపాయాలు బాగా ఎక్కువగా వుండటమే ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రజల ద్వేష భావనలకు మూలం…ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం పౌరుల సగటు ఆదాయుం కంటే ప్రభుత్వోద్యోగుల సగటు ఆదాయం బ్రిటన్లో 1.4 రెట్లు అధింగా ఉన్నది. ఇండోనేషియాలో 1.0; చైనాలో 1.2; అవెురికాలో 1.4; దక్షిణకొరియాలో 1.5; అర్జెంటీనాలో 1.9; సింగపూర్లో 2.9; మలేసియూలో 2.9 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఇది అత్యధికంగా భారతదేశంలో 4.8 రెట్లు ఉన్నది. ఇది భారతదేశంలో ప్రభుత్వోద్యోగుల భారీ వేతన భత్యాలను చెల్లించడానికే పేద ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారా అనిపిస్తోంది.
ఇలా వుండగా సెవెంత్ పే కమీషన్ ఉద్యోగుల వేతన భత్యాలను 23శాతం పెంచాలని సిఫార్సు చేసింది. సౌకర్యవంతంగా జీవించే హక్కు ప్రభుత్వోద్యోగులకు ఉందందన్న అంశాన్ని బేస్ చేసుకుని ఈ రికమెండేషన్ చేశారు. అయిుతే నెలకు కేవలం రూ.6000 మాత్రమే ఆర్జించగలుగుతున్న కూలీకి సౌకర్యవంతమెుౖన జీవనపు హక్కు లేదా? కూలీకి సుఖప్రదమెుౖన జీవితం లేనప్పుడు ప్రభుత్వోద్యోగులు సౌకర్యవంతవెుౖన జీవనానికి హక్కుదారులు ఎలా అవుతారు?
మరో వైపు వేతనాలు సదుపాయాల పెంపుదలలో సామర్ధ్యం, ఉత్పాదకతలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉదాహరణకు ప్రభుత్వ టీచర్ జీతం నెలకు 30 వేల రూపాయలు ఆయన విద్యార్ధుల్లో సగం మందే పాసవుతారు. ప్రయివేట్ టీచర్ జీతం 8 వేలు ఆయన విద్యార్ధుల్లో 90 శాతం మంది మంచి మార్కులతో పాసవుతారు. ప్భుత్వరంగంలో వేతన నిర్ధారణలో వ్యక్తుల ప్రొడక్టివిటీ, ఎఫీషియన్సీ లెక్కకు అందవు.
ఈ వివక్ష అనాదిగా వుంది. ”రాజు నియమించిన ఉద్యోగులలో చాలామంది ఇతరుల సంపదలు, ద్రవ్యాలను దోచుకునే వారే, వీరినుంచి ప్రజలను రాజే రక్షించాలి’ అని చాణక్య నీతి చెబుతోంది” ఇదే కాలక్రమంలో ఉద్యోగం వచ్చిందికాబట్టి జీతం..పని చేయడానికైతే లంచం అన్నట్టు మారిపోయింది.
దేశప్రజల సగటు ఆదాయానికి, ప్రభుత్వోద్యోగుల సగటు ఆదాయానికి పెద్దతేడా వుండని విధంగా వేతన సవరణలు చేస్తేనే ఉద్యోగుల పట్ల ద్వేషభావనలు వుండవు. అయితే ఉద్యోగువల్ల ఎన్నికల్లో ఒకసారి చావుదెబ్బతిన్న చంద్రబాబు కాని, దేశ్ బదల్ రహాహై( దేశం మారిపోతోంది) అంటున్న నరేంద్ర మోదీ కాని పొరపాటున కూడా ఉద్యోగుల తేనెతుట్టను కదిలించే ప్రయత్నం కూడా చేయరు.
సుపరిపాలన పునాదుల వీుద మాత్రమే గొప్ప దేశాన్ని, రాష్ట్రాన్నీ నిర్మించడం సాధ్యమవుతుంది. ప్రజలకు సుపరిపాలనను ఇచ్చేది ప్రభుత్వోద్యోగులే. వారి ప్రవర్తన సుపరిపాలన అవసరాలకు అనుగుణంగా లేకపోవడమేు అసలు సమస్య.
ప్రభుత్వోద్యోగులంటే ప్రజల్లో వ్యతిరేక భావనలకు ఇదే మూలం!