వైసీపీ నేతలకు చాలా తెలుసు. కానీ గుంభనంగా ఉంటారు. ఎప్పుడో ఒక సారి బెదిరింపుల కోసం కొన్ని విషయాలు బయటపెడుతూ ఉంటారు. తాజాగా లావు కృష్ణదేవరాయుల్ని బెదిరించడానికి పేర్ని నాని కొొన్ని విషయాలు చెప్పారు. అదేమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లావు కృష్ణదేవరాయులు డబ్బులు ఉన్నాయట. ఆయన పేరు బయటకు రాకపోవచ్చు కానీ మీ డబ్బులు ఉన్నాయని వారి పార్టీకి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.పేర్ని నాని మాటల్ని బట్టి చూస్తే.. ఆయనకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీకి కూడా తెలియని సమాచారం తెలుసన్నమాట. మరి వారికి ఎందుకు చెప్పలేదు ?
ఇదంతా పేర్ని నాని ఎందుకు చెప్పారంటే.. విడదల రజనీపై ఆరోపణలు, వైసీపీ లిక్కర్ స్కాం గురించి లోక్ సభలో లావు కృష్ణదేవరాయులు మాట్లాడారు. అందుకే కోపం వచ్చింది. ఆయనపై ఢిల్లీ లిక్కర్ మరక వేయడానికి పేర్ని నానిని తెరపైకి పంపారు. కృష్ణదేవరాయులు రాసిచ్చింది చదివారాని పేర్ని నాని చెప్పుకొచ్చారు. మరి ఆయన కూడా రాసుకొచ్చిదే చదివారు. సజ్జల స్క్రిప్టును పేర్ని నాని తన లాంగ్వేజ్ లో మీడియా ముందు చదువుతారు. ఆ విషయం వైసీపీలో అందరికీ తెలిసిందే.
విడదల రజనీ వ్యవహారంలో మధ్యవర్తిని పంపిన విషయం దగ్గర నుంచి లావు కృష్ణదేవరాయులు చాలా విషయాలు బయట పెట్టారు. కానీ మళ్లీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఒక్క వైసీపీ నేత ముందుకు రాలేదు. మీరు ప్రారంభించారు.. మేం కంటిన్యూ చేస్తాం.. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం అనే సరికి సైలెంట్ అయిపోయినట్లుగా ఉన్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.