వైసీపీ నేతలకు చాన్స్ ఇస్తే సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాసేకుంటారు. ఈ విషయం మరో సారి రుజువు అయింది. అదానీ నుంచి లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయించేందుకు పెద్ద నోరున్న పెద్ద పాలేరుగా చెప్పుకున్న పేర్ని నాని బరిలోకి దించారు. ఆయన జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసిందని ప్రకటించారు. ఇదెప్పుడు జరిగిందబ్బా అని అందరూ ఆశ్చర్యపోయారు. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చిందని అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇటీవల బీపీ ఆచార్య అనే అక్రమాస్తుల కేసులో నిందితుడు అయిన ఐఏఎస్‌పై విచారణకు గతంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుడా సీబీై కేసు పెట్టింది కాబట్టి ..తనపై కేసు చెల్లదని ఆయన దిగువ కోర్టులకు వెళ్లారు. చెల్లుతుందని చెబితే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఇటీవల ఆయనపై కేసు చెల్లదని చెప్పింది. అంటే అవినీతి చేయలేదని చెప్పలేదు. ఆయన తప్పు చేయలేదని చెప్పలేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కాబట్టి కేసు చెల్లదన్నారు. దీన్ని పట్టుకుని జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. కోర్టులను ఘోరంగా తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.
అమెరికా కోర్టులో అక్కడి ఎఫ్‌బీఐ చెప్పిన దాన్ని ఇక్కడి మీడియా ప్రచారం చేస్తే జగన్ రెడ్డి అండ్ టీంకు కోపం వస్తోంది. దమ్ముంటే ఒప్పందాలు రద్దు చేయాలని పేర్ని సవాల్ చేశారు. చంద్రబాబు ఎప్పుడో అంతర్జాతీయ అవినీతి చేశారని ..సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను అరెస్టు చేసింది తెలియదా అని చెప్పుకొచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈశ్వరన్.. ఏదో కంపెనీకి నుంచి కొన్ని ఫుట్ బాల్ టిక్కెట్లు.. కొన్ని బహుమతులు తీసుకున్నారని జైలు శిక్ష వేశారు. ఆయనకు ఏ కేసులో శిక్ష వేశారో తెలిసి కూడా ప్రజల్లో ఏదో తప్పుడు సమాచారం పంపాలని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
వైసీపీపై వరుసగా పడుతున్న పిడుగులతో ఆ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. అదానీతో వ్యవహారం కాబట్టి కేంద్రం కాపాడుతుందని.. తమ జోలికి రారని అనుకుంటున్నారు. కానీ రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా !