వైసీపీ హైకమాండ్ కు ఏ కష్టమొచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది పేర్ని నాని, కొడాలి నానిలే. వారినే సమావేశం అని తాడేపల్లికి పిలిపిస్తారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తారు. అదే తమ విధానం అనుకుంటారు. అలా మాట్లాడితేనే మీడియాలో ఫోకస్ వస్తుంది. లేకపోతే రాదు. అందుకే ఆ నానీలిద్దర్ని పిలిచి మాట్లాడిస్తారు. కానీ పార్టీలో మాత్రం వారికి లభించే ప్రాధాన్యం అంతంతమాత్రం. తాము పెద్ద పాలేర్లమని చెప్పుకుని సిగ్గు వదిలేసి… తుడిచేసుకుని తిరుగుతున్నారు కానీ… వారిలోనూ అసంతృప్తి ఉండే ఉంటుంది.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో పనికి మాలిన వాళ్లను మంత్రులుగా కొనసాగించి తమను పని తీరు పేరుతో పక్కన పెట్టడం వారికి అసంతృప్తి కలిగించకుండా ఉంటుందా ? ఇలా పక్కన పెట్టి.. పోటుగాళ్లని మంత్రి పదవులు ఇచ్చిన వారిని కాకుండా. .. మళ్లీ తమను పిలిచి ఎందుకు ఇలా ప్రెస్ మీట్లు పెట్టించి.. ప్రభుత్వ విధానాలపై మాట్లాడిస్తారని వారు అనుకోకుండా ఉంటారా ? పదవులు వాళ్లకు .. బాధ్యతలు మాకా అని వీరు అనుకోకుండా ఎందుకు ఉంటారు … ? కానీ మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వీరిని ఫిక్స్ చేసేసింది. విపక్షం నేతలు క్షమించరానంతగా మాట్లాడారు. ఎన్ని అవమానాలు జరిగినా వైసీపీలో ఉండటం తప్ప వేరే మార్గం లేదు. అందుకే వీరు కూడా.. చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు.
తాము పూర్తి స్థాయిలో ఫిక్స్ అయ్యామని వారికీ అర్థమైంది. కానీ తమ రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి… ఇలా చేయాల్సి రావడం వారిలోనూ అసహనానికి కారణం అవుతుంది. అది ఎప్పుడు బయటపడుతుందో కానీ.. వైసీపీని షేక్ చేస్తుందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మరితంగా బయటపడిన తర్వాత వీరు కూడా తమదైన రాజకీయం చేసి… సీఎంజగన్ కు చుక్కలు చూపిస్తారని వారి అనుచరులు… చెప్పుకుంటున్నారు.