ఓ నేరం జరిగింది . ఆ నేరం వీఐపీ చేశాడు. జైలుకెళ్లలేడు. తన దగ్గర డబ్బంది. అందుకే తన దగ్గర పని చేసే వాడిని బకరా చేయాలని డిసైడయ్యాడు. కొంత డబ్బు ఇచ్చి నేరం మీదేసుకోమని సలహా ఇచ్చాడు. డబ్బు కోసం అతను అదేపని చేస్తాడు.. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు పాత రోజుల్లో వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇలాంటి కథల్ని చెప్పేందుకు రాజకీయ నాయకులు కూడా తగ్గడం లేదు. దీనికి పేర్ని నానినే ఉదాహరణ.
గోడౌన్ లో పెట్టిన బియ్యం దోచుకుంది పేర్ని నాని. ఇప్పుడు ఆయన, ఆయన కుటుంబం జైలుకెళ్లకుండా ఉండేందుకు ఓ బకరాను రెడీ చేసుకున్నారు. ఆయనే గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్. అతని జీతం కేవలం పన్నెండు వేల రూపాయలు. కానీ ఇప్పుడు జైలుకెళ్తే ఎంత ఇస్తామన్నారో కానీ.. ఆయన పోలీసుల వద్ద, దర్యాప్తులో సింగిల్ డైలాగ్ చెబుతున్నారు.. అంతానేనే చేశాను అనే మాట మాత్రమే చెబుతున్నారు. ఏది అడిగినా అదే చెబుతున్నారు. దీంతో పోలీసులు .. ఓ పాత సినిమా లైన్ ను ఇప్పుడు వాడితే ఎలా అని నవ్వుకుంటున్నారు.
మాసన్ తేజ్ అనే వ్యక్తి పేర్ని నానివద్దపని చేస్తున్నాడు. బియ్యం డబ్బులు అన్నీ మాసన్ తేజ్ ఖాతాలో పడ్డాయి. వాటిని ఆయన పేర్ని నాని కుటుంబానికే పంపారు. కొన్నింటినీ తన పేరు మీద వారి కుటుంబానికి కావాల్సిన వాటిని కొనుగోలు చేశారు. వీటన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. అయినా బయటపడేందుకు.. ఒక్క వ్యక్తిని బకరాను చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ అరెస్టుభయంతో ఆయన వణికిపోతున్నారు ., పోలీసులు మాత్రం.. ఈ కేసు విషయంలో ఖచ్చితంగా ఉంటున్నారు. ఎవర్నీ వదిలి పెట్టాలని అనుకోవడంలేదు. అందుకే పేర్ని నానికి పెద్ద కష్టం వచ్చేసింది. ఆ కష్టంలో ఏం చేస్తున్నారో తెలియకుండా పాత సినిమాల కథల్ని చెప్పేందుకు కూడా వెనుకాడటంలేదు.