వైసీపీ నేతలు క్రమంగా కంట్రోల్ తప్పి పోతున్నారు. కౌంటింగ్ ఎలా సక్రమంగా సాగుతుందో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈసీ ఆఫీసు ముంద పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వివ్న ఎవరికైనా.. కౌంటింగ్ విషయంలో వైసీపీ చాలా పెద్ద కుట్రలే పన్నుతున్నదని అర్థమవుతుంది. ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల పక్రియ గందరగోళంగా.. ఘర్షణ వాతావరణంలోకి మారబోతోదంని దీనికి ఈసీదే బాధ్యత అని పేర్ని చెప్పుకొచ్చారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో టీడీపీ చేసిన అభ్యర్థనను అంగీకరించడం అంట.
పోస్టల్ బ్యాలెట్స్ ఐదున్నర లక్షల వరకూ పోలయ్యాయి. చాలా బ్యాలెట్స్ పై రిటర్నింగ్ అధికారులు సీలు వేసి సంతకం చేయాలి.. కానీ రిటర్నింగ్ అధికారులు చాలా వరకూ ఆ పని చేయకుండా వదిలేశారు. ఆర్వోలు చేసిన తప్పునకు.. ఉద్యోగుల ఓట్లు ఎందుకు వృధా కావాలని అలాంటి ఓట్లను పరిగణించాలని టీడీపీ కోరింది. ఈసీ అంగీకరించి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దీన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు ఏపీలో ఎందుకు ఒప్పుకున్నారని.. వెంటనే.. ఆ రూల్స్ ను వెనక్కి తీసకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరుక సీఈవో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన పేర్ని నాని బయట మీడియాతో ఈ హెచ్చరికలు జారీ చేశారు.
కౌంటింగ్ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లుగా తమ నేతల్ని పంపి.. రచ్చ చేయించే ప్రణాళికను వైసీపీ వేస్తోందని ఇప్పటికే అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటలిజెన్స్ కూడా ఈ అంశంపై సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పేర్ని నాని వ్యాఖ్యలు ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పోలీసులు కౌంటింగ్ రోజు మరిన్ని కఠినమైన చర్యలు .. కౌంటింగ్ కేంద్రం లోపల చేపట్టాల్సి ఉంటుందేమో ?