పది రోజుల పాటు ఫ్యామిలీని తీసుకుని ఆజ్ఞాతంలోకి పోయిన పేర్ని తాజాగా తాను ఒక్కరే బయటకు వచ్చారు. అసలు బియ్యం మాయం కేసు తన భార్య జయసుధపై నమోదు కావడంతో ముందు ఆమెను అరెస్టు కాకుండా.. జైలుకు పోకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన నిర్వాకంతో భార్య జైలుకు వెళ్తే ఆయనకు కుటుంబసమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే ముందుగా బియ్యం ఖరీదు, జరిమానా మొత్తం కలిపి రూ. కోటి 72 లక్షలకు చెక్కులు పౌరసరఫరాల శాఖ అదికారులకు ఇచ్చారు.
తన భార్య జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడుతూండటం.. తాను పరారీలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూడంటంతో ఆయన బయటకు వచ్చారు. ఆయన భార్యపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే మాయమైన బియ్యానికి డబ్బులు కడితే సరిపోదని నేరం చేసిన తర్వాత జరిమానాతో సరి పుచ్చుకోలేరని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసులు నమోదయినందున.. చట్టపరమైన ప్రాసెస్ ఉంటుందని అంటున్నారు.
నిజానికి డబ్బులు కట్టడమే పేర్ని నానికి అసలు మైనస్ అయిన.. ఆయన బియ్యాన్ని దొంగతనం చేసినట్లుగా అంగీకరించినట్లు అయిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొదట్లో ఆయన తన గోడౌన్లో వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఎక్కువ స్టాక్ ఉన్నట్లుగా నమోదు అయిందని వాదించారు. దానికే కట్టుబడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఆయన డబ్బులు కట్టేశారు. అంటే ఆయనకు తెలిసే బియ్యాన్ని తరలించినట్లుగా స్పష్టమవుతోంది. ఈ కేసు విషయంలో పేర్ని నానిని ఏ మాత్రం వదిలి పెట్టకూడదని టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు.