వైసీపీ హైకమాండ్ పేర్ని నానిని మంత్రి పదవికి పనికి రాడని పీకేసి ఉండవచ్చు కానీ ఆయనను వాడుకోవడానికి ఉన్న ఏ ఒక్క చాన్సునూ వదిలి పెట్టడం లేదు. మొన్నటిదా పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా వెంటనే ఆయనపై విరుచుకుపడటానికి వాడుకునేవారు. ఇప్పుడు కొత్తగా.. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇవ్వడానికి.. కూడా ఆయనకే అక్కరకు వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాటలు ప్రజల్లోకి వెళ్లక పోతూండటం… జగన్మోహన్ రెడ్డికి నేరుగా మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడి చేసేంత సామర్థ్యం లేకపోవడంతో…. దానికిపేర్ని నానినే కరెక్ట్ అని మీడియా ముందుకు పంపుతున్నారు.
వివేకా హత్య కేసు పరిణామాలు… .. జగన్ తీరు.. జరిగిన వ్యవహారాలన్నిటినీ గుదిగుచ్చి టీడీపీ ఓ పుస్తకం వేసింది. ఈ పుస్తకంపై కౌంటర్ ఇచ్చే బాధ్యతనూ పేర్ని నానికే ఇచ్చింది హైకమాండ్. కానీ అక్కడ ఎదురుదాడి చేయడానికి ఏమీ లేక… పుస్తకంలో టీడీపీ పేర్లేసుకోలేదని.. మరొకటని విమర్శించేశారు. సీఎం జగన్ భార్య భారతి పేరు ఫోటో వేశారని.. ఇదేం పద్దతని ఆవేశపడ్డారు. చివరికి వివేకా హత్య కేసులో ప్రశ్నించాల్సింది ఆయన కుమార్తె, భార్య, అల్లుడినేనన్న వైసీపీ వాదనను సమర్థించుకున్నారు. ఎలా సమర్థించుకోవాలో.. ఏం మాట్లాడాలో సజ్జల బ్యాక్ ఆఫీస్ నుంచి పేర్నికి పాయింట్లు వస్తాయి. దాని ప్రకారం మాట్లాడి ఉంటారు.
కానీ పేర్ని నానికి తెలియకుండా ఉంటుదా…. తనను పార్టీలో ఎలా వాడుకుంటున్నారో… ఎంతగా చులకన చేస్తున్నారో ..! వివేకాను దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆ నేరాన్ని న్యాయం కోసం పోరాడుతున్న కుమార్తెపై వేయడానికి ప్రయత్నిస్తున్న వైనం ఇప్పటికే .. ఇదేం ఘోరం అనుకునేలా చేస్తోంది. దీన్ని సమర్థించి… పేర్ని నాని కూడా అంతేనా అనుకునేలా చేసుకున్నారు. మొత్తంగా పేర్ని నాని మంత్రి పదవి పోయినా.. పెద్ద పాలేరునని ప్రకటించుకున్నందున… వారు మాట్లాడమన్నది మాట్లాడాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు.