జగన్ కు… వైఎస్ కుటంబానికి పెద్ద పాలేరుగా ప్రకటించుకున్న పేర్ని నానికి వైసీపీలో భవిష్యత్ అయిపోయిందన్న ప్రచారం మచిలీపట్నంలో జోరుగా సాగుతోంది. పోర్టు శంకుస్థాపనలో ఆయన చేసిన ప్రసంగం మొత్తం తేడాగా ఉండటమే ఇందుకు కారణం కాదు.. జగన్ ను..వైఎస్ ను ఏక వచనంతో సంబోంధిచారన్న కోపం జగన్ కు ఉందని తాజా వెల్లడయింది. ఇష్టారీతిన మాట్లాడటంలో పేర్ని నాని స్టైల్ వేరు. పవన్ కల్యాణ్ పై అలాగే విరుచుకుపడేవారు. అదే స్టైల్ లో జగన్ ను పొగడాలని అనుకున్నారు కానీ..జగన్ కు అది వేరేగా అర్థమయింది.
పేర్ని నాని తీరును సీఎంవో అధికారులు మందలించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి తన జేబులో మనిషన్నట్లుగా మాట్లాడటం.. తనకు వైఎస్ ఎంతో దగ్గర అన్నట్లుగా చెప్పుకోవడంపై సీఎంవో అధికారి ధనుంజయ్ రెడ్డి పేర్ని నానిని పిలిచి గట్టిగానే మందలించినట్లుగా చెబుతున్నారు. దీంతో పేర్ని నాని మరింత ఫీలయ్యారు. ఇటీవల తరచూ ఆయన .. పార్టీలో ఉండటం.. ఉండకపోవడం గురించి మాట్లాడుతున్నారు. తాను కొడుకునైనా వదులుకుంటాను కానీ పోటీ జగన్ ను మాత్రం వదలనని చెప్పుకొస్తున్నారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంటారు.. పేర్ని నాని నోరు గతంలో బాగానే ఉండేది..కానీ వైసీపీలో.. జగన్ స్టైల్ కు మారడానికి ఆయన తన నోరును చెడ్డ చేసుకున్నారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీలో ఆయనకు కానీ..ఆయన కుమారుడికి కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు జగన్ ను గౌరవించకుండా ఏకవచనంతో సంబోధించడంతో మొదటికే మోసం వచ్చేసిందని చెబుతున్నారు.