తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. జగన్మోహన్ రెడ్డి ఆత్మీయుడిగా చూస్తూంటారు… అయితే లోపల మాత్రం వేరేలా అనుకుంటూ ఉంటారని..ఆయన సలహాలేవీ పాటించకూడదని అనుంకుంటారని.. మంత్రి పేర్ని నాని పరోక్షంగా చెప్పారు. దానికి ఆర్టీసీ విలీనం కథను చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి .. గతంలో కేసీఆర్‌ను కలిసినప్పుడు.. ఆర్టీసీని విలీనం చేయవద్దని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం భరించడం గుదిబండ అని ..చాలా పొరపాటు చేస్తున్నావని కూడా జగన్‌తో అన్నారట.కానీ.. జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా.. కేసీఆర్ చెప్పినందుకైనా సరే.. చేసి చూపించాలన్న ఉద్దేశంతో .. విలీనం చేశారని.. పేర్ని నాని చెప్పుకొచ్చారు.
గతంలోనూ ఆర్టీసీ విలీనానికి.. కేసీఆర్‌కు ముడిపెట్టి .. పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. తాము.. ఎంత గొప్ప పని చేశామో .. చెప్పడానికి.. కేసీఆర్ ను ఉదాహరణకు .. పేర్ని నాని పదే పదే చెప్పడానికి ప్రయత్నించడంపై.. వైసీపీ నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ – కేసీఆర్ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణనూ.. పేర్ని నాని…బయట పెట్టడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్… ఆర్టీసీని విలీనం చేయకూడదనుకున్నారు. ఆ సంస్థను ఆ సంస్థలాగే ఉంచాలనుకున్నారు. ఆయన విధానం ఆయన ఫాలో అయ్యారు. ఆత్మీయుడు కదా.. అని ఓ సలహా ఇచ్చి ఉంటారు.. దానికి ఆయనేదో.. అడ్డుకోబోయారని.. దాన్నే సవాల్‌గా తీసుకుని జగన్ విలీనం పూర్తి చేశారని.. కార్మికుల ముందు పేర్ని నాని గొప్పలకు పోవడం.. కలకలం రేపుతోంది.
ఆర్టీసీని విలీనం చేయడానికి తాము ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని చెప్పే ఉద్దేశంతోనే… కేసీఆర్ ప్రస్తావన పదే పదే పేర్ని నాని తెస్తున్నారని భావిస్తున్నారు. ఆయన చేయకున్నా… ఆయన వద్దని చెప్పినా.. తాము చేశామన్న అభిప్రాయాన్ని కార్మికుల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా… ఇప్పటికీ కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. పెన్షన్, ఇతర సౌకర్యాలపై క్లారిటీ లేకుండా పోయింది. అందుకే కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. వీరిని బుజ్జగించడానికి.. పేర్ని నాని కేసీఆర్‌ను వాడుకుంటున్నారన్న అభిప్రాయం కార్మికుల్లో ఏర్పడుతోంది.