వైఎస్ 75వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆయన ప్రకటన చూసి అందరూ షర్మిల చేయబోతున్న కార్యక్రమం కంటే పెద్ద ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేశారని అనుకున్నారు. కానీ వైసీపీ క్యాడర్ అంతా కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టాలట. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ వంటివి చేయాలని పార్టీ నేతలకు పేర్ని నాని పిలుపునిచ్చారు. వైఎస్సార్ ను ఆరాధించేవాళ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.
పేర్ని నాని పిలుపును బట్టి చూస్తే.. వైసీపీ హైకమాండ్.. వైఎస్‌ను ఏదో ఫోటోకు దండేసి దండం పెట్టి సర్దుకుంటుందని అర్థమైపోతుంది. పార్టీ శ్రేణలు మాత్రం ఘనంగా చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ పేరుతో ఐదేళ్లు అధికారం అనుభవించిన జగన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు కానీ.. పార్టీ క్యాడర్ కు మాత్రం..వైఎస్ పేరుతో అన్నీ పంచేయాలని పిలుపునిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సారి వైఎస్ కు పూర్తి స్థాయి గౌరవం ఇచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎనిమిదో తేదీన విజయవాడలో భారీ వేడుక ేర్పాటు చేశారు. వైఎస్ ఆత్మీయులందర్నీ ఆహ్వానించారు. రాహుల్, సోనియా వస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ వారు వస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అలాగే రేవంత్, సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి వారిని కూడా ఆహ్వానించారు. వారి రాకపైనా స్పష్టత లేదు. అయితే హైకమాండ్ నుంచి ఓ కీలక నేత వస్తారని మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. షర్మిల ఆ రేంజ్ లో చేస్తూంటే… జగన్ మాత్రం.. పార్టీ క్యాడర్ కే ఆ ఆఫర్ ఇచ్చేశారు.