పేర్ని నాని కుటుంబానికి ఎప్పట్నుంచో గోదాములు లేవు. ఆయన మంత్రి అయిన తర్వాతనే కట్టించారు. తన భార్య పేరు మీద కట్టించారు. వెంటనే తన పదవిని అడ్డం పెట్టుకుని తన గోదాముల్లో బియ్యం నిల్వ చేయించారు. అదే అధికారంతో వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. గోదాముల్లో పెట్టినవి సొంత బియ్యం అన్నట్లుగా కేజీ పద్దెనిమిది రూపాయల చొప్పున అమ్మేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ డబ్బులన్నీ గోడౌన్ మేనేజర్ ఖాతా నుంచి పేర్ని నానికి చేరినట్లుగా కూడా గుర్తించారు.
పేర్ని నాని భార్యకు అసలు ఇందులో సంబంధం లేదు. ఆమెకు ఏమీ తెలియదు. ఆమె పేరుతో గోడౌన్లు కట్టించడం వరకూ పేర్ని నాని చేశారు. భార్య పేరుతో గోడౌన్లు ఉన్నప్పుడు .. వాటిలో ప్రభుత్వ సరుకు పెట్టించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే కేసులు పడేది తన భార్యపైనే అని ఆయనకు తెలియకుండా ఉండదు. కానీ బియ్యం మొత్తం అమ్మేసుకుని ఎన్నికల ఖర్చుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు భార్యను కాపాడుకోవడానికి తాను ఆజ్ఞాతంలోకి వెళ్లానని కబుర్లు చెబుతున్నారు.
పేర్ని నాని భార్యకు ఎలాగోలా బెయిల్ వచ్చినా అసలు స్కామర్ ఆయనే కాబట్టి పోలీసులు ఏ సిక్స్ గా చేర్చారు. దాంతో ఆయన తనను అరెస్టు చేయవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తాత్కలిక రిలీఫ్ ఇచ్చింది. కానీ కేసు మాత్రం చాలా బలంగా ఉంది. బియ్యంఎక్కడ అమ్ముకున్నారో ఆధారాలతో సహా బయటపడింది. అందుకే పేర్ని నాని ఇక బయటపడటం కష్టమని అంటున్నారు.