జనాలు ఏమనుకుంటున్నారన్నది మాకు అక్కర్లేదు..మేము చెప్పాలనుకున్నది మాత్రం చెప్తామనే ధోరణి వైసీపీ నేతల్లో పెరుగుతోంది. అదే పనిగా అబద్దాలను మాట్లాడితే జనం పసిగట్టరా అని,ఆ పార్టీ నేతల ప్రెస్ మీట్ ను చూసిన వారిలో కలిగే సందేహం. కానీ , వైసీపీ నేతల ప్రెస్ మీట్ ను ఆ పార్టీ క్యాడర్ తప్ప మిగతా వారు ఎవరు ఎక్కువగా చూడరనేది క్లియర్.అందుకే ఆ పార్టీ నేతలు అబద్దాలను అందంగా మాట్లాడుతున్నారనే సెటైర్లు పేలుతున్నాయి.
2019లో వైసీపీ హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చామని , వారికి జీతాలు కూడా పెరిగాయని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కానీ,ఒక్క ఖాళీని కూడా ఐదేళ్లలో భర్తీ చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు.. వాలంటీర్లుగా పార్టీ కార్యకర్తలకు పదవులు ఇచ్చుకొని వారు రోడ్డుపాలు అయ్యేలా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అసలు ఖాళీలు లేవని చెప్పేవారు.
కూటమి అధికారంలోకి వచ్చాక 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారు. టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఎంతోమంది సర్కార్ ప్రకటనపై హ్హర్షం వ్యక్తం చేశారు. ఇంకా కూటమి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండటంతో కడుపు మంటో మరేమిటో, మేము 2లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పేశారు పేర్ని నాని.ఇది చూసిన ఉద్యోగార్థులు వైసీపీ నేతలు ఇక మారరు అంటూ ఫైర్ అవుతున్నారు.