వైసీపీలో ఒక్కరంటే ఒక్కరూ సక్రమంగా ఉండరు. రాజకీయ విమర్శల్ని రాజకీయంగా తీసుకోవడం కూడా ఉండదు. వారూ..వీరూ అనేమీ ఉండదు. నోరుంది కదా అని మీద పడిపోతూంటారు. ఎదురు తిరిగి అన్నా.. పరువు , ప్రతిష్టలు..లాంటివేమీ తమకు ఉండవని వారు గట్టిగా ఫిక్సయి ఉంటారు. అలాంటి వారిలో పేర్ని నాని మరీ ముందు ఉంటారు.
ఏపీ నేతలు ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై ఆయన చేసే ఘోరమైన కామెంట్ల గురించి చెప్పాల్సిన పని లేద. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ పై ఘోరమైన కామెంట్లు చేశారు. పక్క రాష్ట్రంలో పదవిపోయిన వాడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు దేవుడు పైన ఊడగొడితే.. బీజేపీ కింద ఊడగొట్టిందన్నారు. అంటే.. బండి సంజయ్ కు బట్ట తల వచ్చిందని.. టీ బీజేపీ అధ్యక్ష పదవిని తీసేశారని పేర్ని నాని ఉద్దేశం.
పైన ఊడి పోయిన వాడు ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ వైసీపీని విమర్శిస్తున్నారన్నారు. బండి సంజయ్కు దేవుడు పైన ఊడగొట్టాడని.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టిందని సెటైర్ వేశారు. ఉత్తర భారతంలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్నట్టు ఏపీలో జరుగుతుందనుకున్నారా..? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాల గురించి ఇటీవల బండి సంజయ్ ప్రశ్నించారు. అందుకే ఈ ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాద్యతల్లో ఉన్నారు. ఆయనపై ఇలా ఘోరంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు, మాజీ మంత్రులపై బీజేపీ ఎలా ఎదురుదాడి చేస్తుందో చూడాల్సి లఉంది.