బియ్యం మాయం చేసిన కేసులో తమకేం సంబంధం లేదని అంతా గోడౌన్ మేనేజరే చేశాడని పేర్ని నాని కుటుంబం పోలీసులకు ఒకటే మాట చెబుతున్నారు. రేపు ఆ మేనేజర్ కూడా అవును మా సార్ కు తెలియకుండా బియ్యం అంతా తానే అమ్ముకున్నాను అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. తన భార్య జైలుకు పోకుండా ఉండేందుకు పేర్ని నాని చేయాల్సినదంతా చేస్తున్నారు. అయిన ప్రయత్నాలు ఫలించి ముందస్తు బెయిల్ వచ్చింది. కోర్టు షరతుల మేరకు విచారణకు హాజరయి..తనకేం తెలియని అంతా గోడౌన్ మేనేజర్ చూసుకున్నారని తేల్చారు.
రేపు పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతో నమ్మకమైన కుర్రాడు అని గోడౌన్ మేనేజర్ గా ఉద్యోగం ఇస్తే తనకే ద్రోహం చేశాడని మానస్ తేజ్ అనే వ్యక్తిగా విరుచుకుపడిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతనే మేనేజర్. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కానీ పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించారు. ఆ బియ్యాన్ని మానస్ తేజ్ ద్వారానే అమ్మించారు. అలా అమ్మిన డబ్బులు ఆయన ఖాతాకే వచ్చాయి. అక్కడి వరకే కథ ఉంటే పేర్ని ఫ్యామిలీ బయటపడినట్లు అయ్యేది. ఆ డబ్బులు అక్కడి నుంచి పేర్ని కుటుంబానికి చేరాయి. అంటే అసలు క్లైమాక్స్ అక్కడే ఉందన్నమాట.
అది కూడా ఫోన్ పే ద్వారానే లావాదేవీలు జరిగాయి. పోలీసులకు అందాల్సిన సాక్ష్యాలు అందిపోయాయి. అయినా పేర్ని నాని చేయాల్సిన డ్రామలు చేస్తున్నారు. ఇప్పుడు మేనేజర్ ను అయినా అందులో నిందితుడిగా మార్చి తాము బయటపడాలనుకుంటున్నారు. పేర్ని నాని వ్యవహారం చూసి.. ఆయన ఇంత కాలం ధైర్యంగా నిలబడే లీడర్ అనుకున్నాం కానీ ఇంత చీప్ గా ఆలోచిస్తున్నారేంటి అని అనుచరులు కూడా ఫీలవుతున్నారు.