వివాదాల నుంచి ప్రచారం పొందాలనేది సినిమా నటుల ప్లానే కానీ.. అలాంటి నెగెటివ్స్ ద్వారా తాము కూడా పబ్లిసిటీ పొంది రేటింగ్‌లు పెంచుకోవాలనేది టీవీ9 వ్యూహం. రవిప్రకాష్ ఉన్నప్పుడు అలాంటి వాటిని వందశాతం పక్కగా రేటింగ్లుగా మార్చుకున్నారు. విమర్శలు వచ్చినా తగ్గలేదు. అయినా టీవీ9 ఇమేజ్ అంతకంతకూపెరిగిపోయింది. దానికి కారణం.. పరిమితులేమిటో రవిప్రకాష్ పక్కాగా డిసైడ్ చేసి పెట్టారు కాబట్టి.కానీ ఇప్పుడు టీవీ9కి పరిమితులు అర్థం కాక పరువు పోగొట్టుకుంటోంది. సోమవారం స్టూడియోలో అదే జరిగింది.
స్టూడియోలో దేవీ నాగవల్లీ … నటుడు విశ్వక్ సేన్‌తో వ్యవహరించిన తీరు.. టీవి9పై వెగటు పుట్టేలా చేసింది. ఇది నెగెటివ్ పబ్లిసిటీ తేవడం కాదు కదా.. మొత్తానికి చులకన చేసేసింది. విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం నడిరోడ్‌పై ఓ ఫ్యాన్స్ ప్రాంక్ వీడియో చేయించుకున్నాడు. దాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు. ఇది నచ్చిన ఓ వ్యక్తి మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదుచేశాడు.. సినిమా నటుడు.. వివాదం అనే వాసన తగిలే సరికి.. టీవీ9 గంగ వెర్రులెత్తిపోయింది. వెంటనే విశ్వక్ సేన్‌ను టీవీ9 పిలిచిచర్చ పెట్టింది. ఆయనకూ కావాల్సింది పబ్లిసిటీనే కాబట్టి వచ్చాడు.
అయితే్ వచ్చినప్పటి నుండి యాంకర్ దేవీ నాగవల్లి హీరోను దారుణంగా కించపరుస్తూ మాట్లాడటం ప్రారంభించారు. ఎంత పబ్లిసీటీ అవసరం అయినా క్యారెక్టర్‌ను దిగజారుస్తూంటే ఆ హీరో ఉరుకోలేకపోయారు.అదే చెప్పారు. దానికే రోషం వచ్చిన దేవీ హీరోను సైగలతో గెటవుట్ అనేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విశ్వక్ సేన్ చేసింది తప్పా.. ఒప్పా అన్న సంగతి పక్కన పెడితే..టీవీ9 భావదారిద్య్రం మాత్రం మరోసారి ప్రేక్షకుల ముందు బయటపడింది. టీవీ9ని విమర్శించడంకూడా దండగే.. చానల్ మార్చేయడమే బెటర్ అన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.