‘పేట’ ప్రీ రిలీజ్లో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్ నోరు పారేసుకున్నారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, యువి అధినేతలను కుక్కలతో పోల్చారు. గ్యాంగ్స్టర్ నయీమ్ను చంపినట్టు షూట్ చేసి పారేయాలని అన్నారు. నోటికి అడ్డు అదుపు లేకుండా వల్లభనేని అశోక్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా… మెగా కాంపౌండ్ నిర్మాత ‘బన్నీ’ వాసు, దిల్ రాజు హుందాగా బదులు ఇచ్చారు.
అయితే… వల్లభనేని అశోక్ మాత్రం మరోసారి నోరు పారేసుకున్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. టీవీ9 డిస్కషన్లో “నిర్మాతల కుటుంబ సభ్యుల ఉసురు పోసుకునే బదులు వాళ్ళ అమ్మాయిలను ….. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు” అని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. “వీళ్ళ నలుగురిని (అల్లు అరవింద్, దిల్ రాజు, యువి అధినేతలు అనుకోవచ్చు) చెప్పులతో కొట్టే రోజు వస్తుంది. అద్దాల మెడల్లో వున్న వీళ్ళను …. పగలగొట్టే రోజు వస్తుంది” అనడంతో అతణ్ణి డిస్కషన్ నుంచి టీవీ9 బయటకు పంపింది.
ఆదివారం ‘పేట’ రిలీజ్లో వ్యాఖ్యలపై బన్నీ వాసు “ప్రసన్నగారూ… తమరు తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దును దాటడం మాత్రమే మిగిలింది” అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. “నోటికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేనూ మాట్లాడగలను. కానీ, నాకో క్యారెక్టర్ వుంది” అని దిల్ రాజు అన్నారు. వీరిద్దరూ ఇంత హుందాగా బదులు ఇచ్చినా.. వల్లభనేని అశోక్గారికి సంస్కారం అనేది తెలియకపోతే ఎలా? ఇండస్ట్రీలో తోటి నిర్మాతలకు, తోటి నిర్మాతల కుటుంబ సభ్యులకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా?