న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడి విషయంలో న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతీసే కుట్ర ఉందని.. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని.. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని.. సహకరించేందుకు సీబీఐని నియమించి.. తక్షణం .. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రను బయట పెట్టాలని సుప్రీంకోర్టు న్యాయవాదులు, జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ పిల్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని వారు పిటిషన్లో కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణల విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు అయిన జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్… 30కిపైగా అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్న జగన్.. న్యాయవ్యవస్థ ఇమేజ్ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారంటూ.. హైకోర్టు న్యాయమూర్తులు కొందరిపై.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ సీజేఐ కి లేఖ రాశారు. అత్యంత కాన్ఫిడెన్షియల్ అయిన ఆ లేఖను.. తన ప్రభుత్వ ముఖ్య సలహాదారుతో మీడియాకు రిలీజ్ చేయించి.. మీడియా ముఖంగా.. న్యాయమూర్తులపై విమర్శలు చేశారు. ఇదంతా.. ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని… న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనం కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. న్యాయవ్యవస్థపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని న్యాయవాదులు మండిపడుతున్నారు. ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడమే జగన్ లక్ష్యమని వారు చెబుతున్నారు. న్యాయమూర్తులపై జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ ఆధారాలు లేనివని.. పేగా.. అసహజమైనవని.. అన్నీ కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలని న్యాయవాదులు చెబుతున్నారు. తక్షణం జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించి.. ఈ అంశంపై జ్యూడిషియల్ విచారణకు ఆదేశించాలని పిటిషనర్లు కోరుతున్నారు. మరో వైపు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా.. జగన్ తీరును తప్పు పట్టారు. కుట్ర పూరితంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యకం చేస్తూ లేఖలు విడుదల చేశారు.