శ్రీనివాస్ అవసరాల అచ్చ తెలుగు దర్శకుడు. మంచి మాటల రచయిత. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ లాంటి రెండు విజయాల తర్వాత ఆయన నుంచి సినిమా రావడానికి చాలా కాలమే పట్టింది. అయితే ఎట్టకేలకు నాగశౌర్య తో చేస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా టీజర్ బయటికి వచ్చింది.
టీజర్ లో అడుగడుగునా అవసరాల మార్క్ కనిపించింది. టైటిల్ కి తగ్గట్టు టీజర్ లో అమ్మాయి అబ్బాయి తప్పితే మరో పాత్రకు చోటివ్వలేదు. ఇదో ప్రేమ కథ. నాగశౌర్య, మాళవిక నాయర్ కెమిస్ట్రీ కూల్ గా వుంది. కళ్యాణ్ మాలిక్ నేపధ్య సంగీతం హాయిగా వుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో చిత్రీకరించారు. అవసరాల సినిమాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు, మలుపులేవీ వుండవు. ఒక సింపుల్ కథనే మనసుని హత్తుకునే చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఈ టీజర్ అవసరాల మళ్ళీ ఓ క్లాస్ ఎంటర్ టైనర్ ని అందిస్తాడనే నమ్మకం కలిగించింది.