ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ కొత్త ఫార్మ హబ్ గా మారుతోంది. హైదరాబాద్ ఫార్మా రంగానికి కీలకమైన ప్రాంతంగా ఉంది. విశాఖలోనూ ఫార్మారంగం విస్తరించింది. ఇప్పుడు కాకినాడ కూడా ఫార్మా రంగానికి సూటబుల్ సెంటర్ గా మారుతోంది. దివీస్ లేబోలేటరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు వందల ఎకరాల్లో నిర్మించిన కొత్త ప్లాం్ నుండి ప్రొడక్షన్ ఏడాది చివరి నుంచి జరగనుంది. ఈ ప్లాంట్ పై దివీస్ లేబోలేటరీస్ పదిహేను వందల కోట్లు పెట్టుబడిపెట్టింది. అరబిందో ఫార్మా సంస్థ మరో రెండు ప్లాంట్లను పెట్టడానికి ఇప్పటికే సాన్నహాలు పూర్తి చేసింది. కాకినాడ సెజ్‌లో ఇది రెండో అది పెద్ద పెట్టుబడి అవుతుంది.
Also Read :కాకినాడ తాకట్టు – ఇక తర్వాత ప్రైవేటు ఆస్తులేనా ?
కాకినాడ ఇప్పటికే పెట్రోలియం సహా వివిధ రంగాల పరిశ్రమలు ఉన్నాయి. తొమ్మిది వేల చిన్నతరహా పరిశ్రమలు, అరవై ఐదు మెగా పరిశ్రమలు ఉన్నాయి. రానున్న రోజుల్లో పారిశ్రామిక రంగాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకుసిద్ధమవుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల మధ్య విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో 1,127 ఎకరాల ఉప్పు భూములు ఉన్నాయి. అవి క్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పుడు భూసేరణ అవసరం కూడా ఉండదు. అందుకే విమాశ్రయాన్ని నిర్మించాలనుకుంటే శరవేగంగా పూర్తవుతుది.
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు కార్గొసేవలకు ఎయిర్ పోర్టు బాగా ఉపయోగపడే అవసరం ఉంది. కోనసీమ, కాకినాడ జిల్లాలనుంచి కొబ్బరి, చేపలు, రొయ్య లు, ఫార్మా తదితర ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాడైపోయి రోడ్లను బాగు చేయించడం.. మంచినీటిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తేవడం వంటి సవాళ్లను పూర్తి చేస్తే.. కాకినాడ పారిశ్రామిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.