ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఆయన మొదట అప్రూవర్ అయ్యేందుకు ప్రయత్నించి తర్వాత ఆగిపోయారు. అమెరికా నుంచి వచ్చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు. కానీ రాలేదు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారా లేకపోతే మరో దేశంలో ఉన్నారా అన్నది కూడా పోలీసులకు తెలియడం లేదు. ఆయన పూర్తిగా కాంటాక్ట్ లో లేకుండా పోయారు. దీంతో రెడ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని అంటున్నారు. కానీ ఉన్నారో లేదో తెలియదు. పలుసార్లు పోలీసులు కోరినా వస్తానని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు అసలు టచ్ లో లేకుండా పోయారు. ప్రణీత్‌రావు అన్ని ఎవిడెన్స్‌ను ధ్వంసం చేశారని కన్ఫామ్ చేసుకున్నాక ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ధ్వంసం చేసిన వాటిలో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఉండటంతో సైబర్ టెర్రరిజం కేసులు పెట్టారు. ఇప్పటికే అరెస్టైన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. రెడ్ నోటీసులు జారీ చేయడం..సైబర్ టెర్రరిజమ్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ముందు ముందు పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పరిస్థితి ఊహించిన దాని కన్నా ఘోరంగా ఉందని తేలిన తర్వాతనే కేసీఆర్ జైళ్లంటే తనకు భయంలేదని.. ట్యాపింగ్ లో తమకేమీ తెలియదని ఇంటలిజెన్స్ అధికారులే అంతా చేశారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ లో ట్యాపింగ్ కేసు ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని.. ఎన్నికల కోడ్ ఆయనను కొన్ని రోజులు కాపాడుతుందని కంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల తర్వాత ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది.