మోదీ రైతు చట్టాలను రద్దు చేస్తున్నారని ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ మాత్రం ముందుగా ఊహించారు. తమ డిమాండ్‌తోనే చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనలు ముందుగానే చేశారు. కేసీఆర్ ప్రకటనల్లోని సారాంశం.. మోదీ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఎవరికీ తెలియనిది కేసీఆర్‌కు భలే తెలిసిందే అనుకున్నారు. చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం వస్తోంది. దీంతో నమ్మకమైన సోర్స్ కేసీఆర్‌కు ఉందనుకున్నారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వాన్ని చుట్టు ముడుతున్నాయి.
తన ఫోన్‌కు తుషార్ అనే వ్యక్తి నుంచి మెసెజ్ రాగానే… ఫామ్ హౌస్ కేసులో ఉన్న తుషార్ అని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారని.. తన ఫోన్లోకి వచ్చిన మెసెజ్ గురించి… టీఆర్ఎస్ నేతలకు ఎలా తెలిసిందని గవర్నర్ ఆశ్చర్యపోయారు. అసాంఘిక శక్తుల కదలికలు తెలుసుకునేందుకు పోలీసులు టెలిఫోన్ యాక్టు ప్రకారం అనుమానితుల ఫోన్లను టాపింగ్ చేయవచ్చు. కాని రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ ఇటీవల కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు 10 వేల మందికిపైగా ఫోన్లలో పెగాసస్ ఉంది. తమ విషయాలు అన్నీ మోడీ తెలుసుకుంటున్నారు. కిషన్ రెడ్డి ఫోన్‌ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారు.. అని కేటీఆర్ ప్రకటించారు . అది ఊహాగానామా లేక రూఢీగా తెలుసా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ టీఆర్ఎస్ సర్కార్‌పై విపక్షాలన్నీ అవే ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టులో కేసు కూడా ఉంది. ఈ పరిణామాలన్నింటితో కేంద్రం.. ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రస్తుతం కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. విచారణకు అనుమతి ఇస్తే.. అధికారిక విచారణ అవుతుంది. లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం తమ నిఘా వర్గాల ద్వారా అసలు విషయం తెలుసుకునే అవకాశం ఉంది.