పోలవరంపై ఏం జరుగుతుందో వైసీపీ ఎంపీలకు స్పష్టంగా తెలుసు. కేంద్రం మొండికేసింది. కనీసం బతిమాలే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. అసలు జగన్ అడగడమే మానేశారు. ఇక హోదా గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా వీటి గురించి వైసీపీ ఎంపీలు పదే పదే పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నారు. లేదు..రాదని చెప్పిస్తున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ .. ఈ రెండింటిపైనా రాజ్యసభలో ప్రశ్నించారు. దానికి ఎప్పట్లాగే కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు.
నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని బోస్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంతే కాదు…పోలవరంకు కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2,441 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే జగన్ అర్జంట్‌గా పదివేల కోట్లు కావాలని లేఖ రాశారు. దాన్ని మడిచి ఎక్కడ పడేశారో కూడా స్పష్టత లేదు. ఇవ్వాల్సింది అంతేనని తేల్చేశారు. అదే సమయంలో ప్రత్యేకహోదాపైనా పిల్లి బోస్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల వాటాను పెంచడమే కాకు.. ఎవరికైనా లోటు ఉంటే భర్తీ చేస్తున్నామని..ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
అటు పోలవరం పూర్తి కాదు.. హోదా రాదు అని వైసీపీ ఎంపీ మరోసారి కేంద్రం ద్వారా చెప్పించినట్లయింది. ఇలా ఎందుకు చేస్తారో స్పష్టత లేదు కానీ.. మొదటి నుంచి వైసీపీ ఎంపీల తీరు ఇలాగే ఉంది. వాటిపై ఆశలు వదిలేసుకోమని ప్రజలకు సందేశం పంపాలని అనుకుంటారో.. లేకపోతే.. తామే పోరాడుతున్నట్లుగా కలరింగ్ ఇన్నాలనుకుంటారో కానీ.. తమ చేతకాని తనాన్ని ఎలివేట్ చేసే ప్రస్నలే ఎక్కువగా అడుగుతూ ఉంటారు.