కేసుల్లో ఇరుక్కుని పారిపోయి. .. సుప్రీంకోర్టుకు వెళ్లి కాస్త రిలీఫ్ తెచ్చుకున్న వైసీపీ నేతల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. పోలీసులకు పట్టుకోవడం చేత కాలేదని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ నిజానికి అది టీడీపీ వ్యూహం అని కాస్త ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎవరైనా పరారైతే ఏం చేస్తారు.. బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. తాము ఎక్కడున్నామో ఎవరికీ తెలియకండా.. రహస్యంగా బతికేస్తూంటారు. కుటుంబసభ్యులతో మాట్లాడటానికి కూడా భయపడుతూ ఉంటారు. బయటకు కనిపించడం లేదు. అంటే జైల్లో ఉన్నట్లే లెక్క.
ఇప్పుడు వైసీపీలోని చాలా మంది నేతలు పరారీలో ఉన్నారు. కొంత మంది నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి కాస్త రిలీఫ్ తెచ్చుకున్నారు. అతి కష్టం మీద అరెస్టును తప్పించుకోగలిగారు. కానీ అది ఒక కేసులోనే. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు.. అరాచక శక్తి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు. ఆయన కోసం పోలీసులు వెదకడం లేదు. కానీ నిఘా పెట్టి ఉన్నారు. ఆయనను ఎప్పుడు అరెస్టు చేయాలనుకుంటే అప్పుడు అరెస్టు చేస్తారు.
అలాగే లిక్కర్ వాసుదేవరెడ్డి , మైనింగ్ వెంకటరెడ్డి కూడా. వారిని అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి బెయిల్ తెచ్చుకునేవారు..కానీ ఇప్పటికీ వారు పరారీలో ఉండాల్సి వస్తోంది. రాజకీయంగా దెబ్బకొట్టాలంటే.. వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడమే కాదు.. భయంతో పారిపోయేలా చేయడం కూడా . అరెస్టు ఆప్షన్ ఎప్పటికీ మిగిలి ఉంటుంది. ఇలా భయంతో పారిపోయేలా చేస్తే.. వారికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఎగసి ఎగిసి పడిన వారు ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. అదే రకాజకీయం అనుకోవచ్చు.