ఏపీలో ఎన్నికల ముగిశాయి. ఫలితాలు కోసం అందరూ వెయిటింగ్. అయితే ఫలితాలు రాకముందే పిఠాపురం ఫలితాన్ని కొందరు అభిమానులు తేల్చారు. అక్కడ గెలిచేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తీర్పునిచ్చేశారు. ఇప్పుడా నియోజకవర్గం ప్రజలు, అభిమానుల్లో ఒకటే నినాదం. అదే.. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’. ఇదే టైటిల్ కార్లు, ఆటోలు, బైక్ లపై పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో దర్శనమిస్తోంది.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై ఎవరికీ పెద్ద సందేహాలు లేవు. పవన్ ని అసెంబ్లీలో చూడాలని ఓటర్లు బలంగా నిర్ణయింగా నిర్ణయించుకున్నారని ఎన్నికల ముందే పలు సర్వేల్లో తేలింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో అభిమానులు ఇలా తమ ప్రేమని చాటుకుంటున్నారు.
ఇప్పటికే పిఠాపురం ఎం.ఎల్.ఏ గారి తాలుకా అనే ట్యాగ్ లైన్ వైరల్ ట్రెండ్ గా మారింది. మామూలుగా చెప్పాలంటే సినిమా టైటిల్ కు సరిపోయేంత స్టఫ్ ఇందులో ఉంది. సినీ నిర్మాతల ద్రుష్టిలో పడిందో లేదో కానీ ఒకవేళ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకుంటే గనుక కోట్ల ఖర్చు చేసిన రాని పబ్లిసిటీ టైటిల్ తో వచ్చేసినట్లే.
మరోవైపు ‘బాబాయ్‌ని చంపినవాడి తాలుకా’ అంటూ మరో క్యాప్షన్ కూడా ట్రెండింగ్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఓ వర్గం. ఇది ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో..!