తెలుగులో గొలుసు కథల సంప్రదాయం చాలా తక్కువ. అన్ని భాషల్లోనూ… ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, అభిరుచుల దృష్ట్యా.. మనమూ ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులేస్తున్నాం. అందులో భాగంగా రూపుదిద్దుకుంటున్న వెబ్ మూవీ `పిట్ట కథలు`. పేరుకు తగ్గట్టే.. నాలుగు కథల సమాహారం. నాలుగు కథలకూ నలుగురు దర్శకత్వం వహించారు. నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, సంకల్ప్ రెడ్డి లాంటి పాపులర్ దర్శకులు ఈ కథల్ని నడిపించడంతో `పిట్ట కథలు` ఇంట్రస్టింగ్ ప్రోజెక్ట్ గా తయారైంది. ఈనెల 19న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
ఈ నాలుగూ నాలుగు విభిన్న నేపథ్యాలకు సంబంధించిన కథలు. కాకపోతే… నాలుగు కథల్ని కలిపే దారం.. ప్రేమ. ప్రేమలోని భావోద్వేగాలూ, ఇష్టాలు, కన్నీళ్లూ.. ముద్దులూ.. అన్నీ కలగలిపి ఇచ్చిన ప్యాకేజీ. ట్రైలర్లో చాలా షాట్స్ కనిపించాయి. కొన్ని హాట్ గా, ఇంకొన్ని ఏరోటిక్గా, ఇంకొన్ని టచింగ్ గా సాగాయి. శ్రుతిహాసన్, అమలాపాల్, మంచు లక్ష్మి, ఈషారెబ్బా, సత్యదేవ్, జగపతిబాబు లాంటి… తారాగణం… ఈ వెబ్ మూవీకి ప్లస్ పాయింట్. నాలుగు కథల సారమేంటో తెలియకపోయినా… కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఈ పిట్ట కథలు ఓ కొత్త అనుభూతి ఇస్తుందన్న సంగతి అర్థమవుతుంది. టేకింగ్‌లో.. మనం నాలుగు అడుగులు ముందుకేసి `నెట్ ఫ్లిక్స్` స్థాయి అందుకున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి ఈ నాలుగు కథలూ ఎలా ఉంటాయో? నాలుగు కథల్లో ఏది అమితంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. 19 వరకూ ఆగాలి.
Love, betrayal and holograms? VR signing up for this right now.#PittaKathalu
@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/BfO0gItRr1
— Netflix India (@NetflixIndia) February 5, 2021