టీజర్లు, ట్రైలర్ల పని…. సినిమాపై ఆసక్తిని పెంచడమే. ఏదో ఉందని చూపిస్తూ, ఊరిస్తూ జనాల్ని థియేటర్లకు రప్పిండచమే వాటి లక్ష్యం. టీజర్ కంటే చిన్నగా ఓ ప్రచార చిత్రం కట్‌చేసి.. దానికో విచిత్రమైన పేరు పెట్టి వదలడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. `అమర్ అక్బర్ ఆంటీనీ` కూడా అదే ఫాలో అయ్యింది. రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. `వైవట్` పేరుతో టీజర్ లాంటిది ఈ రోజు విడుదల చేశారు. రవితేజని మూడు విభిన్నమైన గెటప్పుల్లోచూపించడం తప్ప… ఈ `వైవట్`లో కొత్తగా ఏం లేదు. అవి మూడు గెటప్పులా?? ఒకే గెటప్పుని మూడు డ్రస్సుల్లో చూపించారా? అన్నదీ అనుమానమే. ఎవరు అమర్, ఎవరు అక్బర్, ఎవరు ఆంటోనీ అనే విషయాలపైనా `వైవట్` క్లారిటీ ఇవ్వలేకపోయింది. అసలు ఇలాంటి ప్రచార చిత్రాల ద్వారా చిత్ర బృందం ఏం చెప్పాలనుకున్నది? అనేదీ క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అంటే జనాల్లో ఓరకమైన ఆసక్తి ఉంటుంది. కథేంటో, పాత్రల తీరేంటో వీటి ద్వారా తెలుస్తుందిలే.. అని ఉత్సుకత చూపిస్తారు. ఇదిగో ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ఆ ఆసక్తిని కాస్త సన్నగిల్లేలా చేస్తుంటాయి. అదేదో టీజరే విడుదల చేసి.. కథని, మూడు పాత్రల్నీ క్లుప్తంగా పరిచయం చేస్తే పోయేది కదా?? అంటూ రవితేజ అభిమానులు కామెంట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ శ్రీనువైట్ల అండ్ గ్యాంగ్‌కి చేరాయే లేదో..??