ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పీపీఏలను రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలు, వాటితో వ్యవహరించిన తీరుతో.. దేశం పరువు పోయిందని.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్… ఓపెన్‌గా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఎకనమిక్స్ టైమ్స్ సమ్మిట్‌లో ప్రసంగించిన పీయూష్ గోయల్.. తన ప్రసంగంలో అత్యధిక భాగం… పోయిన దేశం పరువు గురించే మాట్లాడారు. పీపీఏల సమీక్ష వల్ల అంతర్జాతీయ సమాజంలో ..దేశం పరువు పోయిందని … పీపీఏల వ్యవహారంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాలి కానీ.. దేశం పరువు తీస్తే ఎలా అని ప్రశ్నించారు.పరిష్కారం లభించకపోతే కేంద్రం తీవ్రచర్యలు తీసుకుంటుందన్న గోయల్ హెచ్చరించారు. సీఐఐ లాంటి సంస్థలు పరిష్కారం సూచించాలని వేదిక మీద నుంచి కోరారు.
నేరుగా ఏపీ పేరు చెప్పని గోయల్ దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేయడం వల్ల పరువు పోయిందని అంటున్నారు. దక్షిణాదిలో పీపీఏలను సమక్షించిన ఒకే ఒక్క రాష్ట్రం ఏపీ. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని.. పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. తమ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించని పక్షంలో .. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని.. రిజర్వు బ్యాంకును ఆదేశిస్తామని గోయల్ చెప్పుకొచ్చారు. నిజానికి పీయూష్ గోయల్.. విద్యుత్ మంత్రి కాదు. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ గతంలో పీపీఏల విషయంలో ఏపీ సర్కార్‌కు రెండు సార్లు ఘాటు లేఖలు రాశారు. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు పరిస్థితి సీరియస్ గా మారడంతో.. పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి పీపీఏలను రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార వేదికపై నుంచే ప్రకటించారు. ఆ తరవాత తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నారు.
ఆ సమయంలో… కేంద్రం నుంచి మొదటి లేఖ వచ్చింది. కానీ.. జగన్ లెక్క చేయలేదు. ఓ సారి తిరుపతి పర్యటనకు వచ్చిన మోదీని …కలిసినప్పుడు… పీపీఏలో అవినీతి జరిగిందని చెప్పి.. సమీక్షించడానికి పర్మిషన్ తీసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. అప్పట్నుంచి తాము కేంద్రానికి చెప్పే చేస్తున్నామంటున్నారు. నిజానికి పీపీఏల విషయంలో అయినా.. మరో విషయంలో అయినా.. దేశం పరువు పోతుంది అనుకుంటే… ప్రధాని మోడీ అయినా.. అమిత్ షా అయినా జగన్మోహన్ రెడ్డిని ముందడుగు వేయవద్దు అని ఒక్క మాట చెప్పి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఈ దిశగా వారి వైపు నుంచి హెచ్చరికలు వచ్చినా జగన్ అడుగు ముందుకు వేసేవారు కాదు. కానీ తాము చెప్పినా… జగన్ లెక్క చేయడం లేదంటూ.. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దేశం పరువు పోయిందంటూ బాధపడుతున్నారు.