టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టులతో మరోసారి ప్రగతి భవన్కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఐ ప్యాక్ టీం తెలంగాణలో విస్తృతంగా సర్వేలు చేసింది. బలమైన అభ్యర్థులు.. బలహీనమైన అభ్యర్థులు.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇలా అనేక అంశాలపై చేసిన సర్వే రిపోర్టులతో పీకే తుది డ్రాఫ్ట్ తీసుకుని కేసీఆర్ను కలిసినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్లు ఇచ్చేది పీకేనేనని కేటీఆర్ స్వయంగా ప్రకటించిన ఒక్క రోజులోనే ఆయన ప్రగతి భవన్కు రావడం ఆసక్తి రేపుతోంది.
ఇటీవల కొన్ని నియోజకవర్గాల సర్వేలు పూర్తి చేశారు. గత నెల రోజులుగా మిగతా నియోజకవర్గాల సర్వేలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరిస్థితి ఎలా ఉంది.. మారాలంటే ఏం చేయాలన్న అంశాలపై పీకే సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో జాతీయ రాజకీయాల విషయంలోనూ పీకే కొన్ని సూచనలు, సలహాలు కేసీఆర్కు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ను భారత రాష్ట్రీయ సమితిగా మార్చాలని నిర్ణయించడం వెనుక పీకే వ్యూహాలు ున్నాయని భావిస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అవలభించాలి.. అన్నదానిపై పీకే ఆలోచనలను కేసీఆర్ తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విపక్షాలు ఐక్యంగా ఉండే అవకాశం లేనందున దూరంగా ఉండటమే బెటరన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తున్న తరుణంగాపీకే సలహా ఎలా ఉంటుందన్నది టీఆర్ఎస్లోనూ ఆసక్తికరంగా మారింది. బీహార్లో సొంత రాజకీయం ప్రారంభించిన పీకే.. వ్యక్తితంగా టీఆర్ఎస్కు మాత్రమే పని చేస్తున్నారు. ఇతర పార్టీలకు పని చేసేందుకు అంగీకరించలేదు. వైసీపీకి కూడా తన శిష్యుడు పని చేసేలా ఒప్పందం కుదిర్చారు.