ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇది వరకే వేసిన సెట్లో.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొదలెడతారు. ఎన్టీఆర్, చరణ్‌పై యాక్షన్ ఘట్టంతో ఈ షెడ్యూల్‌కి శ్రీకారం చుడతారు. అయితే… ముందు రామ్ చరణ్‌కి సంబంధించిన సన్నివేశాల్ని పూర్తి చేయాలన్నది రాజమౌళి ఆలోచన. ఎందుకంటే… `ఆర్.ఆర్.ఆర్` ముగిసిన వెంటనే ‘ఆచార్య’ సెట్లో చరణ్ అడుగుపెట్టాలి. ఈ మేరకు చిరంజీవి నుంచి కూడా రాజమౌళికి ఇది వరకే విన్నపాలు అందాయి. దాన్ని దృష్టిలో ఉంచుకున్న రాజమౌళి – ముందుగా చరణ్ కనిపించే సన్నవేశాల్ని వీలైనంత త్వరగా ముగించాలని అనుకుంటున్నారు.
అయితే అదంత తేలిక కాదు. చరణ్‌కి జోడీగా నటిస్తున్న అలియా భట్ కాల్షీట్లు సెట్ కావాలి. అలియా కాల్షీట్లని బట్టే… చరణ్‌తో షూటింగ్ ఎంత త్వరగా ముగించొచ్చన్న విషయం ఆధార పడి ఉంటుంది. అజయ్ దేవగణ్‌కి సంబంధించి మరో కీలకమైన షెడ్యూల్ బాకీ ఉంది. అందులోనూ చరణ్ ఉంటాడు. అవి కూడా కుదరాలి. అందుకే కొత్త షెడ్యూల్స్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఏ, ప్లాన్ బిలను రెడీ చేసుకున్నారు. ప్లాన్ ఏ ప్రకారం… అనుకున్నవి అనుకున్నట్టు జరక్కపోతే.. ప్లాన్ బిని ఫాలో అవుతారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుంచి చరణ్ బయటపడాలంటే.. అలియా, అజయ్‌ల డేట్లు సర్దుబాటు అవ్వాలి. మరి ఏం జరుగుతుందో ??