ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర కేసులో సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీంకు రాష్ట్రం బయట సహకారం అందడం లేదు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ఈడీ ఎదుట హాజయరయ్యారు కానీ.. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జబీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదంటూ సిట్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక కేరళకు చెందిన తుషార్, జగ్గూస్వామిల విషయంలోనూ సిట్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ.. తుషార్ అనే వ్యక్తి.. అక్కడి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తన్న ప్రచారం జరుగుతోంది. అలాగే జగ్గూ స్వామి కూడా వారికి దొరకలేదు. రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు సిట్ అధికారులు తీసుకునే చర్యలపై అందరి దృష్టి పడింది. కోర్టు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ జారీ చేయించుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నారు.
విచారణకు సహకరించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పుడు విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేసేందుకు చాన్సివ్వాలని హైకోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు అనుమతి ఇస్తే అరెస్ట్ చేయగలరు…లేకపోతే లేదు. అయితే వీరిని సిట్ అదుపులోకి తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. బీఎల్ సంతోష్ బీజేపీలో అగ్రనేత. ఆయన ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. పోలీసు యంత్రాంగం కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. మరి ఇప్పుడు సిట్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేవలం తెలంగాణకు పరిమితమై ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ నిందితులు ఎవరూ తెలంగాణకు చెందిన వారు కాదు. బీజేపీ తెలంగాణ నేతలకు తెలియదని.. పోలీసులే ప్రకటించారు. బయట నుంచి వచ్చిన నేతలే బేరాలు నడిపారని అంటున్నారు. రామచంద్రభారతి తెలంగాణలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు. ఆయనతో టచ్‌లో ఉండి.. డీల్‌కు ప్రయత్నించిన నేతలెవరూ తెలంగాణలో లేరు. ఇతర రాష్ట్రాల్లో సహకారం లభిస్తే తప్ప తెలంగాణ పోలీసులు ముందుకెళ్లలేరు. గ్గుస్వామిలు మాత్రం డుమ్మా కొట్టారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. అంటే వారు అసలు లెక్కలోకి తీసుకోలేదని అర్థం. దానికి కారణం వారికి ఉన్న బలమైన శక్తుల అండ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ సిట్ అధికారులు రాష్ట్రం బయట నిందితులను కనీసం ట్రేస్ చేయలేకపోతున్నారు.