తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో అటు బీఆర్ఎస్ ,ఇటు వైసీపీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనా వారిలో అప్పుడే ముగ్గురు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అవ్వగా మరికొంతమంది గోడ దూకేందుకు వెయిట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలోనూ ఎంత మంది జగన్ తో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన జోష్ లోనున్న టీడీపీ తెలంగాణలో పార్టీ పునర్ వైభవంపై ఫోకస్ పెట్టింది. నేతలు పార్టీని వీడినా క్యాడర్ పార్టీతోనే ఉందని ,చంద్రబాబు ఫోకస్ చేస్తే పార్టీకి తెలంగాణలో ఆదరణ ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ లోని చాలామంది నేతలు టీడీపీ మాజీలే కావడంతో…ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఆహ్వానిస్తే వారంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ అయి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.
తెలంగాణలో పూర్వ వైభవం కోసం ఎలాగైతే టీడీపీ దృష్టి పెట్టిందో…అలాగే ఏపీలో కాంగ్రెస్ కూడా పునర్ వైభవంపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నేతలను టీడీపీలో చేర్చుకొని బలపడాలని టీటీడీపీ భావిస్తుండగా…వైసీపీ నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ నేతలే కావడంతో వారిని కాంగ్రెస్ లో చేర్చుకొని తిరిగి సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది. చూడాలి ఈ రెండు పార్టీల కృషి ఎంతవరకు ఫలిస్తుందో..