తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట తీరులోనే ఆయన చేతల్లోనూ చాలా భిన్నత్వం ఉంటుంది. రాజకీయాలను ఎంత స్ట్రెయిట్‌గా చేస్తారో… తాడిపత్రి పట్టణం విషయంలోనూ అంతే సూటిగా ఉంటారు. ఐదేళ్లకు ముందు తాడిపత్రి దేశంలోనే బెస్ట్ మున్సిపాలిటీల్లో ఒకటి. కానీ గత పదేళ్ల కాలంలో అది ఇతర మున్సిపాలిటీల మాదిరిగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తూండటంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. ఇక ముందు ఎవరైనా అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. చివరికి ఆ చెత్త తెచ్చి మీ ఇంట్లోనే పోస్తానని హెచ్చరించారు. అప్పటికే మారకపోతే తాడిపత్రి నుంచి తనను వెళ్లగొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే పట్టణం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా.. చెత్తతో నింపేసి..ఆయనను వెళ్లిపోవాలని సూచించవచ్చన్నమాట.
ఊరిపై ప్రతి ఒక్కరికి మమకారం ఉంటుంది. అది జేసీ ప్రభాకర్ రెడ్డికి కాస్త ఎక్కువ. ఆయన తాడిపత్రిని సొంత ఇంటిలాగా చూసుకుంటారు. ప్రతి ఇంటి ముందు చెట్టు ఉండకపోతే ఊరుకోరు. తాడిపత్రిని శుభ్రంగా ఉంచడానికి… ప్రజలకు పౌరసేలు సక్రమంగా అందించడానికి ఆయన చేయని ప్రయత్నం ఉండదు. అయితే తాడిపత్రి అభివృద్ధికి పెద్దగా ప్రచారం రాదు.. ఎందుకంటే అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాల వల్లే. దీనికి కూడా ఓ రకంగా జేసీ బ్రదర్సే కారణం అనుకోవచ్చు.