సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
సాయంత్రం 5 : 30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకొని రాజుపాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు మోడీ. ఈ సభలో టీడీపీ , జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం అనకాపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 : 10కి విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకొని ప్రధాని అహ్మదాబాద్ వెళ్తారు.
ప్రస్తుతం మోడీ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచార సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతారా.. ? టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమనే ప్రకటన చేస్తారా..? అని విశాఖ వాసులు వెయిట్ చేస్తున్నారు.
మరోవైపు.. ఈ బహిరంగ సభతోనైనా వైసీపీ – బీజేపీ ఒకటి కాదనే విధంగా జగన్ ను మోడీ టార్గెట్ చేస్తారా..? లేదంటే చిలుకలూరిపేట సభ తరహాలోనే వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయరా..? అని రాజకీయ వర్గాలు ఈ బహిరంగ సభను ఆసక్తిగా గమనిస్తున్నాయి. చిలుకలూరిపేట బహిరంగ సభలో వైసీపీపై మోడీ ఎలాంటి విమర్శలు చేయకపోవడం చర్చనీయంశమైంది. దీంతో అనకాపల్లి బహిరంగ సభలో మోడీ ప్రసంగం ఎలా ఉండనుందోనని ఎదురుచూస్తున్నాయి.