జాతీయగీతం జనగణమన ఆలపిస్తున్నపుడు అందరూ లేచి నిలబడి దానితో గొంతు కలిపిపాడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరయినా పాడలేకపోయినా లేచి నిలబడి దాని పట్ల గౌరవం ప్రదర్శిస్తారు. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ విషయం తెలియదనుకోలేము. కానీ ఆయన నిన్న రష్యాలోని వ్నుకోవ-IIవ విమానాశ్రయంలో దిగినపుడు ఆయన గౌరవార్ధం రష్యన్ మిలటరీ బ్యాండ్ బృందం భారత జాతీయాగీతం ఆలపిస్తుంటే ఆయన ముందుకు నడుచుకుకొంటూ వెళ్ళారు. అది గమనించిన ఒక రష్యా అధికారి ఆయనను వెనుక నుండి చెయ్యి పట్టుకొని ఆపవలసి వచ్చింది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోడి జాతీయగీతం పూర్తయ్యేవరకు నిలబడ్డారు. ఈ వార్త అప్పుడే ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్లకు పాకిపోయింది. దానిపై నెటిజన్స్ రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు కూడా.