ప్రధానమంత్రి నరేంద్రమోడీ… తాను బీసీ వర్గానికి చెందినవాడిని కాబట్టే.. పదవి నుంచి దింపేయాలనే కుట్ర చేస్తున్నారని.. ఓ ఎన్నికల ప్రచారసభలో.. ఆవేదన వ్యక్తం చేసినప్పటి నుంచి ఆయన కులంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. అది రెండు విధాలుగా ఉంది. ఒకటి… ఓ ప్రధాని స్థాయిలో ఉండి.. కులం గురించి మాట్లాడటం ఏమిటని.. కులాన్ని చూపించి ఓట్లు అడగడటం.. ఏమిటని కాగా… అసలు మోడీ.. బీసీయేనా అన్న చర్చ ఇంకోటి. దేశంలో ఇంత వరకూ… చాలా మంది ప్రధానులు వచ్చారు. వారందరూ.. మళ్లీ .. మళ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నారు. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసి కూడా.. వారిలో చాలా మంది… నైతిక విలువలు పాటించారు. తాను మహిళను అని కానీ… తాను వెనుకబడిన కులానికి చెందిన వాడినని కానీ… చెప్పి.. ఎవరూ… ఓట్లు అడగలేదు.
ఓడిపోతామని తెలిసినా…. తమ పదవికి.. తమ విధానం చెడ్డపేరు తేకూడదన్న లక్ష్యంతో… హుందాగానే వ్యవహరించారు. కానీ… నరేంద్రమోడీ మాత్రం… ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని అంచనా వేసుకున్నారో.. లేక… ఎందుకైనా మంచిదని.. రంగంలోకి దిగారో కానీ.. కుల ప్రస్తావన తెచ్చి మరీ.. ప్రచారం చేస్తున్నారు. మోడీ ఎప్పుడైతే.. తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకున్నారో..అప్పట్నుంచి ఆయన అలా చెప్పుకోవడం ఏమిటన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. కొంత మంది.. ప్రధాని పదవిని దిగజార్చారని అన్నారు కానీ.. చాలా మంది మాత్రం.. అసలు మోదీ బీసీ ఎందుకవుతాడన్న వాదన లేవదీశారు. గుజరాత్లో మోదీ గురించిన పుట్టుపూర్వోత్తరాలను… బయటకు తీసి.. వివాదాస్పదం చేస్తున్నారు. అసలు మోదీ సామాజికవర్గంపై.. విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీన్ని మరింత కొనసాగించేందుకు.. మోడీ… తనను.. కులరాజకీయాల్లోకి లాగొద్దంటూ.. ఓ భారీ ప్రకటన చేశారు.
తనకు తాను కులం ఆపాదించుకుని… అసలు చర్చను ప్రారంభింపచేసిన మోడీనే.. ఇప్పుడు… తనకు కులం అంటగట్టవద్దంటూ… ప్రకటనలు చేయడంతో.. దేశం మొత్తం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మొత్తానికి..మోడీ తాను బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా .. చర్చ ప్రజల్లో జరగాలన్న ఉద్దేశంతోనే.. ఈ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడింది. ఇదే నిజం అని మోడీ రాజకీయ వ్యూహాలను పరిశీలించేవారికి గట్టిగా అనిపించే మాట..!