ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేయబోతున్నారు. అందుకు ఆయన షెడ్యూల్ ఈరోజు ఖరారు అయ్యింది. ఆయన పర్యటన వివరాలు ఈవిధంగా ఉంటాయి. ఈనెల 22న ఉదయం 11.45గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుండి 12.15కి అమరావతి చేరుకొంటారు. 12.35కి శంఖుస్థాపన పూజ చేస్తారు. 1.20 గంటలకి చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం చేసిన తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాని, జపాన్ ప్రధాని ప్రసంగిస్తారు. 2.10 గంటలకు భోజనం. 3.10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుండి తిరుపతి బయలుదేరుతారు. సాయంత్రం 4.05గంటలకి తిరుపతి విమానాశ్రయం ప్రారంభిస్తారు. 5.30గంటలకి తిరుమల చేరి స్వామివారిని దర్శించుకొంటారు. మళ్ళీ 7.30 గంటలకి తిరుపతి విమానాశ్రయం నుండి డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అమరావతిలో శంఖుస్థాపన కార్యక్రమం పూర్తయిన తరువాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి, జాతీయ గీతాలాపన జరుగుతాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వాన పత్రికల డిజైన్ ఖరారు చేసారు. నాలుగయిదు రోజుల్లో అవి కూడా సిద్దం అవుతాయి. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వివద రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ కి బయలుదేరేలోగానే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించవచ్చని సమాచారం.