ప్రధాన మంత్రి నరేంద్రమోడీ… నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు రాక పోవచ్చు కానీ.. ఆయన తనదైన యాప్‌తో.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సందేశం అందించడానికి.. ఏర్పాట్లు చేసుకున్నారు. రెండో తేదీన, ఆరో తేదీన ఆయన తన “నమో యాప్”లో ఏపీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే.. ఏపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. ఎవరెవరు మాట్లాడాలో… ఏమేమి మాట్లాడాలో కూడా ట్రైనింగ్ జరుగుతోంది. నమో యాప్ ద్వారా కార్యకర్తల్ని ఉద్దేసించి .. నరేంద్రమోడీ ప్రసంగించడం ఆషామాషీగా జరగడం లేదు. దానికో ప్రత్యేకమైన టీం ఉంది. టీమ్ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తుంది. కొద్ది రోజుల కిందట.. తమిళనాడు కార్యకర్తలు ఇచ్చిన షాక్‌తో ఇప్పుడు పూర్తిగా.. ఫార్మాట్ మార్చేశారు.
ఇప్పుడు నరేంద్రమోడీతో నమో యాప్‌ద్వారా మాట్లాడాలంటే.. బీజేపీకి చెందిన చోటా నేత అయి.. రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలన్నదానిపై.. ఇన్ స్ట్రక్షన్స్ను కచ్చితంగా ఫాలో కావాలి. ప్రశ్నలు కూడా మోడీ టీం ఇస్తుంది. జవాబులు కూడా మోడీ టీం రెడీ చేస్తుంది..మోడీ ఇస్తారు. గత వారం వరకూ.. రూల్స్‌లో కాస్త ఫ్లెక్సిబులిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఉండటం లేదు. ఎందుకంటే.. తమిళనాడులో.. ఓ బీజేపీ నేత.. నేరుగా మోదీపైనే విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లలో మధ్యతరగతి ఏం చేశారో .. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలని ప్రశ్నించడంతో.. మోడీ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆ వీడియో… హైలెట్ అవడంతో.. చివరికి రాహుల్ గాంధీ కూడా ఎగతాళి చేశారు. దాంతో… ఇక నుంచి … నమో యాప్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడాలంటే.. ముందుగా… స్క్రిప్ట్ రెడీ చేయాలని నిర్ణయించారు.
మాట్లాడబోయేది ఏపీ కార్యకర్తలతో కాబట్టి.. కచ్చితంగా.. ఏపీ గురించే మాట్లాడతారు మోడీ. అందులో సందేహం లేదు. ఓ రకంగా.. తాను ఏపీకి వచ్చి బహిరంగసభల్లో ప్రసంగించాల్సిన మ్యాటర్‌ను అక్కడ వినిపించే అవకాశం ఉంది. నిరసనల్లాంటి అవకాశాలు లేవు కాబట్టి.. వన్ సైడ్‌గా తాను చెప్పాలనుకున్నది చెబుతారు. ఏం చెబుతారన్నదే ఆసక్తి కరం. విభజన హామీల గురించి చెబుతారా..? ఏపీలో అవినీతి జరుగుతోందని చెబుతారా..? లేక పోతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అయినప్పటికీ.. ఇప్పుడు టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని చెబుతారా..? అన్నదే ఆసక్తికరం. ఏం చెప్పినా బీజేపీ కార్యకర్తలతోనే…! ఏ మ్యాటర్ అయినా.. అది.. ముందుగానే స్క్రిప్టింగ్ కాబట్టి.. చెప్పాలనుకున్నదే చెబుతారు.