కొత్త యేడాది ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆలొచింప చేసింది. దేశంలో 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలకు పైబడి ఉందని ప్రకటించారు. ఇది నిజమేనని నమ్ముదామా అని మోడీ ప్రశ్నించారు.
కచ్చితంగా ఇది నమ్మదగిన విషయం కాదు. అందుకే, దెశంలొ నీతి నిజాయితీ పెరగాలి. అవినీతి, తప్పుడు లెక్కల రోజులు పోవాలి అని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు.
విపక్షాల ఆరోపణల్లొ నిజం లేదని ఆయన అంకెలతో నిరూపించారు. ఈ యేడాది రబీ సాగు 6 శాతం పెరిగిందని చెప్పారు. ఎరువుల కొనుగోళ్ళు 9 శాతం పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవసాయం దివాలా తీసిందని రాహుల్ గాంధీ తదితరులు చేసిన ఆరోపణలకు దీటిగా జవాబు చెపారు.
మోడీ అడిగిన మరో ప్రశ్న కూడా ఇలాంటిదే. దెశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి. 65 శాతం యువ జనాభా ఉంది. అవకాశాలు ఉన్నాయి. తగిన సాధనాలు ఉన్నాయి. అయినా ఈ దేశం వెనకబడి ఉండటానికి కారణం ఉందా అని ప్రశ్నించారు. లేదు. ఇంతటి వనరులు ఉన్న దేశం ముందుకు వెళ్లకుండా అడ్డు పడుతున్నదు అవినీతి, నల్లధనం. వాటిపై యుద్ధంలో మద్దతు తెలిపిన ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
పేదలకు, మధ్య తరగతి వారికి సొంత ఇంటి కోసం కొన్ని రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రైతులకూ మేలు చేసే నిర్ణయాలు వెల్లడించారు. గర్భిణీలకు, సీనియర్ సిటిజెన్లకు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు.
అనివీతి, నల్లధనం పై యుద్ధం ఆగదని స్పష్తంగా ప్రకటించారు. డబ్బు కోసం ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని హామీ ఇచ్చారు. మొత్తానికి కొత్త యేడాది ప్రారంబానికి ముందు మోడీ చేసిన ప్రసంగం నవశకానికి నాంది పలకాలనే ఆశయాన్ని చాటింది. సాహసంతో తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చే వరకు ఆయన పోరాటం ఆగదని స్పష్తమైంది.