యుద్ధ విమానాలకు సంబంధించిన రాఫెల్ డీల్ విషయంలో… హిందూ పత్రిక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఫ్రాన్స్‌తో ఈ ఒప్పందం విషయంలో నేరుగా.. ప్రధానమంత్రి కార్యాలయమే సంప్రదింపులు జరిపిందని…తెలిపింది. దానికి సంబంధించి రక్షణశాఖకు చెందిన అంతర్గతంగా జరిగిన ఉత్తర, ప్రత్యుత్తరాలను… హిందూ బయటపెట్టింది. అప్పట్లో పీఎంవో జోక్యంపై.. డిఫెన్స్ సెక్రటరీ.. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కూడా హిందూ పత్రిక బయట పెట్టింది. ఈ నివేదికతో… ఢిల్లీలో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తాము మొదటి నుంచి.. అదే చెబుతున్నామని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అనిల్ అంబానీకి వేల కోట్లు దోచి పెట్టేందుకు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని స్పష్టమయిందని… రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించారు.
పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఇదే అంశంపై గందరగోళం ఏర్పడింది. అయితే.. హిందూ పత్రిక బయట పెట్టిన విషయాలపై నిర్మలా సీతారామన్ సూటిగా జవాబివ్వలేదు. అలాగని.. వాటిని తప్పు అని ప్రకటించలేదు. కానీ..వాటిని బయాస్ చేశారని మాత్రం ఆరోపించారు. పారీకర్ ప్రస్తావన ఉన్నందున.. ఆయన వివరణ తీసుకుని ప్రచురించి ఉండాల్సిందని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశ భక్తి లేనందునే.. రాఫెల్ డీల్‌ను వివాదాస్పదం చేస్తున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ.. కూడా.. కాంగ్రెస్ దేశభక్తికి… రాహుల్ చేస్తున్న రాఫెల్ డీల్ ఆరోపణలకు లింక్ పెట్టారు. ఒక్క రోజులోనే సంచలన విషయం బయటకు వచ్చింది.
కాంగ్రెస్ హయాంలో.. ఫ్రాన్స్ చెందిన సంస్థతో.. రాఫెల్ విమానాల ఒప్పందం సంతకాల వరకూ వచ్చింది. అయితే మోడీ ప్రధాని అయ్యాక… ఫ్రాన్స్ పర్యటనలో… ఆ ఒప్పందాన్ని రద్దు చేసేసి ఉన్న పళంగా.. కొత్త ఒప్పందం చేసుకున్నారు. అందులో ప్రధానమైనది.. ఆఫ్ సెట్ పార్టనర్‌గా… హెచ్ఏఎల్ను తొలగించి.. రిలయన్స్ కు చాన్సివ్వడం. రేట్లు భారీగా పెంచడం, సాంకేతిక పరిజ్ఞానం అక్కర్లేదని చెప్పడం లాంటి.. చాలా .. తిరకాసులు మోడీ చేసుకున్న ఒప్పందంలో ఉన్నాయి. అప్పట్నుంచే దుమారం రేగుతోంది. చివరికి రాఫెల్ డీల్ పై విచారణకు సిద్ధమయ్యారన్న కారణంగానే.. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రే తప్పించారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ డీల్ విషయంలో రోజుకో ఆరోపణ వస్తున్నప్పటికీ.. దేశబక్తి లేని వాళ్లే ఇలాంటివి చేస్తారంటూ.. బీజేపీ ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది.